అవకాశాన్ని అందిపుచ్చుకోవాలె

Tue,January 10, 2017 01:28 AM

ఇంటింటికి నీళ్ళు అందిస్తామని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు వాగ్దానం చేస్తున్నా ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు. సురక్షిత మంచినీరు అందించకపోవడం వల్ల నగర ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొత్తగా ఏర్పడే నగరాల్లో ప్రజలకు తాగునీరు అందించడానికి ఈ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణీకరణ వైపు అతివేగంగా పరుగులు తీస్తు న్న దేశాల్లో మన దేశం ఒకటి. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం రాబోయే దశాబ్దాల్లో నగరాల జనాభా పెరుగుదల నైజీరియా లో 9 శాతం, చైనాలో 12 శాతం, చొప్పున పెరుగుతుందని అంచనా. అదేవిధంగా మన దేశంలో 16 శాతం వర కు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా. ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాలు ఒకప్పుడు చిన్న పట్టణా లే. కానీ రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు సరైన ప్రణాళికలు, దూరదృష్టి లేకపోవడం, అమలులో చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ నగరాలు పేరుకు మహా నగరాలే కానీ కనీస అవసరాలను తీర్చడంలో విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితులు పునరావృతం కాకుం డా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది.

గతంలో తెలంగాణ ప్రాంతంలో పెద్ద నగరాలంటే హైదరాబాద్, వరంగల్ మాత్రమే. తర్వాత వరుసలో ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాలుండేవి. మిగతావన్ని చిన్న పట్టణాలుగా అభివృధ్ధి చెందుతూ వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జిల్లాల పునర్విభజన చేసిన తర్వాత రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రాలు, రెవె న్యూ డివిజన్ కేంద్రాలు పట్టణాలుగా అభివృధ్ధ్ధి చెందే అవకాశం వచ్చింది. పాత 10 జిల్లా కేంద్రాలతో పాటు మొత్తం 31 నుంచి 35 వరకు పెద్ద పట్టణాలుగా, నగరాలుగా అవతరించనున్నా యి. కొత్తగా అభివృద్ధి అయ్యే జిల్లా కేం ద్రాల్లో ఇప్పటివరకు వ్యవసాయ భూమిగా ఉన్న భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే క్రమంలో కొత్త లే అవుట్లు రానున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన 31 జిల్లా కేంద్రాలు త్వరితగతిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా ఈ అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశం ఉన్నది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు శాస్త్రీయమైన ప్రణాళికలు త్వరితగతిన రచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వాడుకొని అన్ని వసతులు కొత్త పట్టణాలకు నాంది పలుకా లె. పట్టణాభివృద్ధి ఒక సువర్ణావకాశంగా పరిగణించి సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలి. రాబోయే తరాలు మెరుగైన జీవనాన్ని పొం దేందుకు పట్టణాలుగా తీర్చిదిద్దాలి. పట్టణాల్లో నగర పౌరులకు కనీస అవసరాలైన సురక్షితమైన మంచినీరు, రోడ్లు, సివరేజ్ సిస్టవ్‌ు, డ్రైనే జీ సిస్టవ్‌ు, పారిశుధ్యం, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ, ఘనవ్య ర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు తమ తమ నగరాలను, పట్టణాలను, నగర పంచాయతీలను ఐదేండ్లలో అత్యంత సుందరం గా తీర్చేదిద్దుకునే అవకాశం ప్రజాప్రతినిధులకు లభించింది.

కేంద్రం 4 లక్షల కోట్ల వ్యయంతో 4 అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టింది. స్మార్ట్ నగరాల ప్రాజెక్టు, అటల్ పట్టణ పునరుజ్జీవన రూపాంతరీకరణ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హృదయ్ హెరిటేజ్ నగరాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. జిల్లాల పునర్విభజన జరుగకముందు 12 పట్టణాలను అమృత్ నగ రాలుగా ఎంపిక చేసింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల జనాభా ప్రాతిపదికగా కేంద్రానికి నివేదిక పంపాలి. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్నట్లయితే అమృత్ పథకం వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణకు అమృత్ నగరాల సంఖ్య పెరుగుతుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 65-70 శాతం ప్రజలకు మాత్ర మే తాగునీరు అందించగలుగుతున్నాం. పట్టణాల్లోని మురికివాడల్లో ని తాగునీరు లభ్యత అంతంత మాత్రమే. ఇంటింటికి నీళ్ళు అందిస్తామని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు వాగ్దానం చేస్తు న్నా ఇప్పటివరకు ఆ కల నెరవేరలేదు. సురక్షిత మంచినీరు అందించకపోవడం వల్ల నగర ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొత్తగా ఏర్పడే నగరాల్లో ప్రజలకు తాగునీరు అందించడానికి ఈ అం శాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యమైన విషయమేమంటే నీరందించే సమయం, వ్యవధి, ఇచ్చే క్రమం, నీటి నాణ్యత ఎప్పుడై తే నగర పాలక సంస్థలు సరిగ్గా ఇవ్వగలుగుతాయో అప్పుడే ప్రజల కు నమ్మకం కలుగుతుంది. సుమారు 85 లక్షల మంది హైదరాబా ద్‌లోని ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించినవే. వారి దూర దృష్టిని ఆదర్శంగా తీసుకొని స్థానిక సంస్థల ప్రతినిధులు తమత మ పట్టణాల్లోని రాబోయే తరాల దాహార్తిని తీర్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
pardasaradhi
రాబోయే యాభై ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని స్థానిక సంస్థలు వ్యూహాత్యకంగా వ్యవహరించాలి. కేంద్రం ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థల నుంచి సామాజిక భద్రత కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం పొందాలి. స్థానిక సంస్థల నాయకత్వం పార్టీలకతీతంగా నిర్ణయాలు తీసుకోవా లి. కిందిస్థాయి ఉద్యోగులను వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించాలి. సకల సౌకర్యాలు గల నగరాలను నిర్మించడం సాధ్యమని నిరూపించాలి. రాజకీయ సంకల్పం, బలమై న నాయకత్వం, వినూత్నమైన ఆలోచనలు, చిత్తశుద్ధిగల ప్రభుత్వం మాత్రమే ఈ పని చేయగలదని నిరూపించాలి. ఈ అభివృద్ధి ఫలాలు భావిపౌరులకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, స్థాని క సంస్థలకు జిల్లాల పునర్విభజన ఓ సువర్ణావకాశంగా భావించాలె.

875
Tags

More News

VIRAL NEWS