మేం ఒంటరిగా నడవకూడదా?

Sun,January 8, 2017 01:45 AM

ఆడ శిశువులను గర్భంలోనే చిదిమేస్తున్నారు. దీనివల్ల సమాజంలో మహిళల సంఖ్య తగ్గిపోతున్నది. ఇం త హింసను తట్టుకొనిపెరిగిన మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. హింసకు పాల్పడుతున్నారు. వారి జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ది నీతి? నైతికత అంటే ఏమిటి? మనం ప్రవచించే నీతి నియమా లు ఇతరులకు ఇబ్బంది కలిగించని రీతిలో ఉండాలె కదా? భార తదేశపు విశాల దృక్పథాన్ని, సమ్యక్ దృక్పథాన్ని, సహనాన్ని సవా లుచేసే ఉద్వేగభరితమైన ప్రశ్నలు ఈ మధ్య తలెత్తాయి. భారత మగవారి వికార అమానుషత్వాన్ని ముసుగు తీసి బయట పెట్టా యి. మహిళలను వెంటాడటాన్ని ఎట్లా సహిస్తాం? కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాత ఎంజీ రోడ్డులో తాగుబోతులు యువతులను తడమడాన్ని, అకృత్యాలకు పాల్పడటాన్ని ఎట్లా అనుమతించగలం? భారతీయ కట్టుబాట్లను తెంచుకున్నారనే నా? మహిళల కష్టాలు దీంతో ముగియలేదు. కొందరు యువతులను వెంటాడి వేధిస్తున్నా, ఏ ఒక్కరూ ఆపరేమిటి? ఈ దుర్ఘటన ఒక్కటేనా? అదే రాత్రి మరోచోట ఇద్దరు మృగాలు ఒంటరిగా వెళుతున్న మహిళపై దాడి చేశారు, అసభ్యంగా స్పృశించ యత్నించారు. దీనికి కారణమేమిటి? ఆమె ఒంటరిగా వెళుతున్నది. అందుకే దాడి! అంతకన్నా రోత పుట్టే విష యం ఏమిటంటే.. చూసేవాళ్లు కనీసం ఆపడానికి ప్రయత్నించకపోవడం! ఢిల్లీ రాజధానిలో జరిగిన దారుణమే ఇక్కడ చోటు చేసుకున్నది.

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా వీధుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, ఉక్రోషం అర్థం చేసుకోదగినదే. కానీ న్యాయం కోసం వారి ఆక్రందనలను పట్టించుకునేదెవరు? తమ విలాస భవనాల్లో పవ్వళించిన నాయకులకు ఈ ఆగ్రహావేశాలు వినబడుతున్నాయా? చట్టాన్ని, న్యాయాన్ని పట్టించుకునేదెవ్వరు? మహిళలపై సాగుతున్న దారుణాలకు నాయకులు క్షమాపణ చెప్పుకోవాలె? నగరాలను మహిళలకు భద్రంగా మారుస్తామని హామీ ఇవ్వాలె. కానీ కర్ణాటక హోం మంత్రి ఇటువంటి ఘటనలు జరుగడానికి పాశ్చాత్య సంస్కృతి కారణమని చెప్పడం దిగ్భ్రాంతికరం. మహిళలు తమ ఒంటిని బయట పెట్టుకునే కొద్దీ.. గ్యాసోలిన్ ఉన్న దగ్గర అగ్ని కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. చక్కెర చల్లితే చీమలు వస్తాయని సమర్థించాడు. ఎంత బాధాకరం! నిజంగా.. రోడ్డుపై ఒంటరిగా నడవడం నేరమా? మహిళల నైతిక ప్రవర్తనకు మగవారు పరిరక్షకులా? భారతీయ సంస్కృతిని నిర్వచించేది మేమే అనీ, ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ధారించేది మేమే అని వారు భావించడమేమిటి? మహిళలు మగవారి కన్నా తక్కువ వారా? వారు పబ్బులకు పోకూడదా? వారు తాగకూడదా?

మన నాయకులు ఇకముందైనా ఇటువంటి ప్రబోధాలు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా! యువతులు జీన్స్ ధరించకూడదు.. నిండైన దుస్తులే ధరించాలె... దేశ మర్యాదకు భంగకరమైన దస్తులు ధరించకూడదు.. అర్ధరాత్రి డ్రైవింగ్ చేయకూడదు... ఇవీ వీరి హితబోధలు. మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి తగిన చట్టాలు చేయవచ్చు కదా.. దోషులను పట్టుకొని శిక్షించడం ద్వారా నేరస్తులు తప్పించుకొని పోలేరనే సందేశం ఇవ్వవచ్చు. కఠిన శిక్షలు పడితే మగవారు అత్యాచారాలకు పాల్పడటానికి భయపడుతరు. నేరానికి పాల్ప డేముందు ఒకటికి వేయిసార్లు ఆలోచిస్తారు. కానీ నాయకులు ఇటువంటి చర్యలు తీసుకోవాలంటే మొదట దేశంలో భద్రతా రాహిత్యం ఉన్నదని గుర్తించాలె కదా! సబ్బుల కంపెనీలు తమ బ్యాండ్ ఇమేజ్‌ను ఎట్లా కాపాడుకుంటాయో, రాజకీయ పక్షాలు తమ ప్రతిష్ఠను అట్లా కాపాడుకునే కాలమిది. కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాలు పరిశీలిస్తే, మహిళల పరిస్థితి ఎట్లా ఉన్నదో తెలుస్తున్నది. గత పదేండ్లలో మహిళలపై అకృత్యాలు రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగాయి. గత దశాబ్దంలో మహిళలపై ఇరవై రెండు లక్షలకుపైగా అత్యాచారాలు జరిగాయి. ప్రతి గంటకు ఇరవై ఆరు నేరాలు జరుగుతున్నయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక ఫిర్యాదు అం దుతున్నది. 2015లో 4,70,556 అకృత్యాలు జరిగా యి. 3,15,074 అపహరణలు, 2,43, 051 లైంగిక అత్యాచారాలు, 1,04,151 అవమానాలు, 80,833 వరకట్న హత్యలు జరిగినయి. అరవై శాతం మహిళలు రెండు నుంచి ఐదింతలు లైంగిక వేధింపులను అనుభవించారు. ఢిల్లీ 23 ఏండ్ల యువతి (నిర్భయ)పై ఐదుగురి ముఠా అత్యాచారం జరిపి నగ్నంగా నడివీధిలో పడేసి బలిగొన్న దుర్ఘటన జరిగి మూడేండ్లయింది. అయినా మహిళలకు భద్రత కల్పించలేకపోవడం దారుణం. ఇంకా మహిళలను వెంటాడి వేధిస్తూనే ఉన్నారు. మరింత ఘోరంగా హింస సాగుతూనే ఉన్న ది. యువతులు ధైర్యంగా కనిపిస్తే మరింత రెచ్చిపోయి దాడులు సాగిస్తున్నారు.

సగటున ప్రతి నిమిషానికి నాలుగు లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో!
ఏ నగరానికైనా, రాష్ర్టానికైనా వెళ్ళండి.. ఒకటే రకం కథలు వినబడుతయి. మహిళలను బానిసల మాదిరిగా అమ్ముతుంటారు. పదేండ్ల పసిపిల్లలకే పెండ్లి చేస్తుంటారు. వరకట్న హింసలుపెట్టి సజీవ దహనాలు చేస్తుంటారు. కుటుంబాలలోనే బానిసలుగా మార్చి హింసిస్తుంటారు. అకృత్యాలు, అత్యాచారాలు అన్నీ సాగుతుంటాయి... బుల్లెట్ ప్రూఫ్ భద్రత మధ్య బందీలుగా బతుకుతుంటారు. అంతా ఆటవిక రాజ్యం.. దీనినేనా మనం నాగరిక సమాజం అని చెప్పుకుంటున్నది! మహిళలను వీధుల్లో నుంచి ఎత్తుకుపోతున్నా మనం పట్టించుకోం. కార్లలో అత్యాచారాలు సాగుతుంటాయి. లండన్‌కు చెందిన ఒక సంస్థ మహిళల భద్రతపై 150 నగరాల్లో సర్వే జరిపింది. దీనిలో ఢిల్లీ 139వ స్థానం లో ఉంటే, ముంబయి 126వ స్థానంలో ఉన్నది. ఇదీ నగరాలలోని పరిస్థితి. మహిళల భద్రతలో మనం అట్టడుగున ఉన్నాం. 2015లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే లైంగిక అత్యాచారాలు 9.2 శాతం పెరిగినయి. అత్యాచారానికి గురైన వారిలో 54.7 శాతం మంది 18 నుంచి 30 ఏండ్ల లోపు వయసు వారే. దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచారాలలో 17 శాతం ఢిల్లీలో నే జరిగినయి. ఒక్క ఏడాదిలోనే అపహరణలు 19.4 శాతం పెరిగినయి. హింస 5.4శాతం, అకృత్యాలు 5.8 శాతం పెరిగినయి. బాలికల రవాణా 122 శాతం పెరుగడం ఆందోళకరం. నేరస్తుల మనస్తత్వం ఎటువంటిదో తెలిసిందే. దీనికితోడు పోలీసుల మనస్తత్వం కూడా అదేవిధంగా ఉన్నది. వివాహ పూర్వ లైంగిక సంబంధాల గురించి ఖుష్బూ తన అభిప్రాయం చెప్పినప్పుడు ఎట్లా కేసులు పెట్టి వేధించారో చూసినం. విద్యావంతు డు తన వధువు కన్యగా ఉంటుందని అనుకోకూడదని ఆమె అన్నారు. వివాహపూర్వ లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు కండోమ్స్ వాడాలని ఆమె సూచించా రు. దీంతో ఆమెను సంఘ విద్రోహిగా ముద్రవేశారు. తమిళ మహిళల గౌరవానికి భంగం కలిగించేవిగా ఆమె మాటలున్నాయని కొత్త అర్థాలు తీశారు.

ఆడ శిశువులను గర్భంలోనే చిదిమేస్తున్నారు. దీనివల్ల సమాజంలో మహిళల సంఖ్య తగ్గిపోతున్నది. ఇం త హింసను తట్టుకొని పెరిగిన మహిళల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. హింసకు పాల్పడుతున్నారు. వారి జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏటా ఇరవై లక్ష ల మంది బాలికల అపహరణ సాగుతున్నది. వారిని వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారు. మధ్యప్రదేశ్‌లో ని ఒక గ్రామంలో ముగ్గురు టీనేజ్ బాలికలపై అత్యాచారం జరిపి చెట్లకు ఉరివేసినా సమాజం మౌనం వహిస్తున్నది. ఇంతకన్నా దారుణం ఉంటుందా? యూపీ లోని భాగ్‌పత్‌లో మహిళలకు సెల్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. వారికి నచ్చిన వారిని వివాహమా డే హక్కులేదు. మగవాళ్ళు వెంటలేకుండా బయట అడుగు పెట్టకూడదు. మొహంపై కొంగు కప్పుకోవలసిందే. దేశంలో ఎక్కడ చూసినా మహిళల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం పరిపాలిస్తున్నట్టు కనిపించదు.
మహిళల విషయానికి వచ్చేసరికి వారి భద్రత ఎవరికీ పట్టదు. ఎవరి భద్రత వారు చూసుకోవలసిందే. లైంగిక దాడులను, వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు లేవు. అంగప్రవేశం జరిగితేనే లైంగిక అత్యాచారం కిందికి వస్తుంది. మహిళలను కించపరిస్తే మహిళల గౌరవానికి భంగం కలిగించారనే లేదా ఆమె వ్యక్తిగత అంతరంగిక స్వేచ్ఛకు భంగం కలిగించారనే కారణంతో కేసు పెట్టవచ్చు. ఈ చట్టం ప్రకారం మరీ ఎక్కువగా అయితే ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెం డూ విధించవచ్చు. ఎంతోమంది మహిళలు ఉన్నత స్థాయిని అందుకున్న దేశంలో వారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నది. ఇందిరా గాంధీని క్యాబినెట్‌లో ఏకైక మగవాడిగా చెప్పుకునేవారు. ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారు. టెన్నిస్ తార సాని యా, బ్యాడ్‌మింటన్ టాపర్ సైనా, రెజ్లర్ గీతా ఫోగత్, డ్యాన్సర్ సోనాల్ మాన్‌సింగ్, యామిని కృష్ణమూర్తి మొదలైనవారు ఉన్నత స్థానాలకు ఎదిగిన మహిళలు.

మన నాయకమ్మన్యులు మహిళలను అభివృద్ధి చేయదలుచుకుంటే వారి సమస్యలు అనేకం ఉన్నాయి. మొదట భ్రూణహత్యలను అరికట్టాలె. వరకట్న హత్యలను, అత్యాచారాలను, కుటుంబ హింసను, బాలికల అపహరణలను, వ్యభిచార కూపంలోకి దింపడాన్ని అరికట్టాలె. స్త్రీ పురుష సమానత్వాన్ని విద్యా బోధనలో భాగం చేయాలె. ఫలానా దుస్తుల వల్ల, ఫలాన స్థలం లో, ఫలానా సమయంలో భద్రత ఉంటుందనే ఆలోచనలు మారాలె. లైంగిక వేధింపుల పట్ల మన ఆలోచ నా ధోరణిని మార్చాలె. తీవ్రమైన మహిళా ఉద్యమం కూడా సమాజంపై ప్రభావం చూపుతుంది. కఠినమైన సమయాలలో కఠిన చర్యలు తప్పవు. విప్లవాత్మకమైన మార్పు రావలసి ఉన్నది. రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులిచ్చింది. మాటల్లోనే సమానత్వం అం టే నమ్మే రోజులు పోయినయి. మహిళలపై అత్యాచారాల పట్ల మౌనం పాటించడంవల్ల దుండగులను ప్రోత్సహించినట్టవుతుంది. వారు తప్పించుకొని పోవడానికి ఆస్కారం ఏర్పడుతున్నది. మహిళలు ఎంత ఉన్నతంగా జీవిస్తున్నారు, ప్రజాస్వామ్యం ఎంత బలం గా ఉన్నదనేది పోలీసులు ఎంత గౌరవంగా, స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మహిళలు ఇంకా అబలలుగా ఉండిపోవలసిందేనా? తాగుబోతుల చేతుల్లో అవమానాలు పొం దవలసిందేనా? ఆత్మపరిశీలన చేసుకోవలసిన తరుణమిది.
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్)
పూనమ్ ఐ కౌశిష్

1828
Tags

More News

VIRAL NEWS