వామ్మో సోషల్‌మీడియా

Sun,January 8, 2017 01:41 AM

జాన్‌కౌవ్‌ు, మార్క్ జుకెర్‌బర్గ్, చార్డ్ హర్లేలు.. వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ఏ ఉద్దేశంతో కనుగొన్నారో కానీ, నేడు ప్రపంచ పజలు మాత్రం ఈ ముచ్చటైన మూడింటితోనే కాలం వెల్లబుచ్చుతున్నారనడంలో సందేహం లేదు.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను మొదట్లో అభినందిచడానికి, వివిధ సందేశాలు పంపించడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు ఏం పోస్టు చేస్తారో, ఎవరు చేస్తారో, ఎందుకు చేస్తారో చేసేవారికి చాలాసార్లు తెలియదు. అయినా అందరూ లైకులు కొడుతారు. ఎందుకంటారా.. ప్రతి వాడికి ఫేస్‌బుక్ ఓపెన్ చేశాక లైక్‌లు కొట్టడం మాత్రమే అలవాటైంది కాబట్టి.


భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక పరిజ్ఞా నం అవసరమే, కానీ రాబోయే రోజుల్లో మానవ మేధస్సుకు, సృజనాత్మకతకు, మానసిక ఎదుగుదలకు, ఆటంకాలయ్యే అవకాశం మెం డుగా ఉందనిపిస్తున్నది.

మన దేశంలో మొత్తం మొబైల్ కనెక్షన్ల సంఖ్య గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి 104 కోట్లుగా ఉందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) గణంకాలు చెబుతున్నాయి. ఇందులో యాక్టివ్ గా ఉన్న కనెక్షన్ల సంఖ్య 94.91 కోట్లు. మొబైల్ వినియోగదారుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 28 కోట్లకు చేరింది. ఈ సంఖ్యాపరంగా అమెరికాను అధిగమించేసి రెండో స్థానానికి చేరాం. 2020 నాటికి మరో 33 కోట్ల స్మార్ట్‌ఫో న్లు వినియోగంలోకి వస్తాయని అంచనా.

ప్రపంచ జనాభాలో 367 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని అంచనా. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కాస్తో కూస్తో కాగితాలు కదిలించేవారు, కంప్యూటర్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఫేస్‌బుక్, యూట్యూ బ్ లేకుండా ఒక్క నిమిషం ఉండలేకపోతున్నా రు. ఏదైన యాంత్రికలోపంతో కొంత సమయం ఇంటర్నెట్ కనెక్షన్‌కు ఇబ్బంది కలిగినట్లయితే జుట్టు పీక్కొని ఊపిరాడనంతగా సతమతమవుతున్నారు. నిజానికి సాధారణ ఆఫీసుల్లో ఒక గం ట ఇంటర్నెట్ లేకపోతే నష్టమేం జరుగదు. గతం లో టీవీ సీరియళ్లకు పరిమితమైన మహిళలు ఇప్పుడు వాట్సప్ చాటింగ్‌లతో వంటలు చేస్తున్నారు. యూట్యూబ్ కాలం గడిపేస్తున్నారు. యువతరం పోకడలకు అదుపే లేకుం డాపోయింది. ఇదివరకు చెవిలో ఏదైనా యం త్రం అమర్చుకుంటే అది చెవులు వినపడటానికి వాడుతున్నారనుకునేవారు. ఇప్పుడు చెవిలో స్పీకర్స్ లేకుంటే చెవులు వినపడవనే స్థితికి జారుకున్నామని చెప్పాలి. రానురా ను సెల్ ఫోన్లలోని శబ్దాలను మాత్రమే అర్థం చేసుకొని, అవతలివా రు మాట్లాడితే అర్థం చేసుకునే అవకాశం ఉం టుందో లేదోనని భయం వేస్తున్నది.

వారెవ్వా వాట్సప్: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్న వారి దగ్గర సమయం లేకుండా పోయింది. ఇదివరకైతే సెల్‌ఫోన్లు కేవలం మాట్లాడటం వరకే వాడేవారు, తర్వాత మెసేజ్‌లు ఆ తర్వాత వాట్సప్ కూడా మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాల్లో 100 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలో ఏడు కోట్ల మంది వాట్సప్ ద్వారా సందేశాలను పంపిస్తున్నారని అంచనా. ఇకపోతే వాట్సప్‌లో మెసేజ్‌లు చూస్తే ఆశ్చర్యం వేస్తున్నది. తొంభై శాతం వరకు మెసేజ్‌లు గుడ్‌మార్నింగ్ లేదా గుడ్‌నైట్‌లు మాత్రమే ఉంటున్నాయి. ఇకపోతే ఎంతో కష్టపడి పరాయి భాష అయినటువంటి ఇంగ్లీషు భాషను నేర్చుకొ ని ఇక ఉపయోగిద్దామనే సమయానికి తిరిగి ఇం గ్లీషు భాషను వాట్సప్ పాతాళంలోకి తొక్కుతుందనే చెప్పాలి. పదాలలోని అక్షరాలను కొరికేస్తున్నారు. to see అంటే 2c అని, the అంటే da అని, great అంటే g8t అని, good mornin -g అంటే gud mng అని, ok అంటే, kk అని రాస్తున్నారు. నిజంగా భాష తెలిసినవారికి మెసే జ్‌లను చూస్తే భయమేస్తూ ఒకింత జాలేస్తున్నది. మెసేజ్ అర్థం తెలియకపోయినా ప్రతివాడు ఫార్వర్డ్ చేయకుండా ఉండలేక పోతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఇక కొందరై తే మెసేజ్‌లను డెలిట్ చేసుకోవడానికి ఆఫీసుల కు, కాలేజీలకు ఒకపూట సెలవు తీసుకునే స్థాయి కి వెళ్లిపోయారంటే వాట్సప్ ఉపయోగం ఎం తుందో ఊహించుకోవాలి. ఈ తరం వారికి ఇం ట్లో నాలుగు గింజలు లేకపోయినా ఫర్వాలేదు, కానీ సమయానికి సెల్‌ఫోన్ రీచార్జ్ చేయడం మాత్రం మరువడం లేదు. ఇకపోతే ఈ మధ్య ఉచిత సివ్‌ు, డాటా ఇస్తున్నా కంపెనీ మార్కెట్లోకి రావడంతో జనాలు ఎగబడి సివ్‌ులు తీసుకుం టున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్ల నుంచి తలలను బయటకు తీసే సమయం దొరుకక తికమక పడుతున్నారు. ఏమైనా అంటే మార్చి వరకు ఉచితం తర్వాత కావున ఈలోపే అన్ని చూసేయాలన్న ధోరణిలో ఉన్నారు. కానీ ఇదే అలవాటుగా మారి రాబోయే రోజుల్లో ఫ్రీ డాటా దొరుకనైట్లెతే పిచ్చె క్కి పోతుందని ఆలోచించేంత సమయం ఎవరికి లేదనే చెప్పాలి.

టీ, కాఫీల సంస్కృతి మనది కాదని మన పూర్వీకులు చెబుతుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషు వారు టీ, కాఫీలను మనవారికి అలవాటు చేసిపోయారు. నేడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచే టీ.. టీ అంటూ అరిచే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆఫీసు, ఇళ్ళు, దుకా ణం అని తేడా లేకుండా ఎక్కబడితే అక్కడ టీ లు కొడుతూ ఆ టీకే బానిసైపోయాడు సగటు భారతీయుడు. బ్రిటిషు వారు పోయినా, వారు అంటించిన అలవాట్లను ఇంకా కొనసాగిస్తు న్నాం దానివల్ల విదేశీ కంపెనీలు లాభపడుతాయ ని చాలామందికి తెలియదు. దోపిడీ చేసేవాడు ముందు ఒక అలవాటును ఎరవేసి తర్వాత ఉన్న ది లేనిదీ దోచుకుంటాడన్న విషయం మనం ఎప్పుడు నేర్చుకుంటామో ఏమో.

లైకులే లైకులు: ఈ రోజుల్లో ఫేస్‌బుక్ లేనిదే పూట గడువటం లేదని చెప్పాలి. ఫేస్‌బుక్ అకౌంట్ లేకుంటే నామూషీ పడే రోజులివి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుం చి వృద్ధుల దాకా ఫేస్‌బుక్ అకౌంట్ మెయింటేన్ చేస్తున్నారు. కేంబ్రిడ్జ్‌లో 2004లో స్థాపింపబడిన ఫేస్‌బుక్ నేడు సుమారు 200 కోట్ల ప్రజలకు చేరువవుతున్నది. ఫేస్‌బుక్ అకౌంట్‌ను మొదట్లో అభినందిచడానికి, వివిధ సందేశాలు పంపించడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు ఏం పోస్టు చేస్తారో, ఎవరు చేస్తారో, ఎందుకు చేస్తారో చేసేవారికి చాలాసార్లు తెలియదు. అయినా అందరు లైకులు కొడుతారు. ఎందుకంటారా.. ప్రతి వాడి కి ఫేస్‌బుక్ ఓపెన్ చేశాక లైక్‌లు కొట్టడం మాత్ర మే అలవాటైంది కాబట్టి. ఈ మధ్య ఫేస్‌బుక్‌లో విచిత్రాలు జరుగుతున్నాయి. అది బర్త్‌డే పిక్చరై నా, పెళ్ళి పిక్చరైనా, చావు పిక్చరైనా అందరూ లైక్‌లైతే తప్పకుండా కొడుతున్నారు. ఒకవేళ లైక్ కొట్టనైట్లెతే పోస్టుచేసిన వారు అడిగి మరీ లైక్‌లు కొట్టించుకుంటున్నారు. అంటే మనమెటు వైపు నడుస్తున్నామో లేదా నడిపించబడుతున్నామో వాట్సప్ చూడకుండా టైముంటే ఒక నిమిషం ఆలోచించండి.
kandikonda-srinivass
యూట్యూబ్: ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా 400 కోట్ల మంది వీడియోలు వీక్షిస్తున్నారని అంచనా. అంటే సుమారు సగంకంటే ఎక్కు వ మంది వీడియోలు చుస్తున్నారనే చెప్పుకోవా లి. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 49 మధ్య వయస్కులే. ఎంతలేదన్నా సుమారు 40 నిమిషాలు వీడియోలను విక్షిస్తున్నారు. కానీ ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏ వీడియోలు వీక్షిస్తున్నారు, సదరు వ్యక్తి తద్వారా ఎంత సమ యం ఉపయోగిస్తున్నాడు. తెలియకుండా డాటా ఎంత వినియోగింపబడుతుంది, దానికి కంపెనీ లు ఎంత చార్జ్ చేస్తారు. తన నెలసరి ఆదాయం లో ఎంత ఖర్చవుతుందని చాలామందికి తెలియ దు. ఇదిపోగా వ్యక్తిగతంగా వీడియోలు చూడ టం వల్ల ఎంత లాభం, ఎంత నష్టం అన్న అంశా న్ని విశ్లేషించడానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు లేరు, సమయం అసలే లేదు.

రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞానం పెంపుదలకో నైపుణ్యాల వెలికితీతకో, మేధస్సు వికాసానికో వాడితే మంచిదే. కానీ ఇటీవలి కాలంలో వాట్స ప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఉపయోగం తీరు చూసినైట్లెతే ఇబ్బందులు ఎదురై లాభం కన్న నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తున్నది. ప్రస్తుతం అదే జరుగుతున్నది. ఇంకా పెనుముప్పు ముందుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకెంత వరకు సమాచారం కావాలో అంతవరకే వాడుకోవాలి. ఏ సమాచారం కావా లో అదే చూడాలి. మీకు చిన్నపిల్లలు యుక్త వయస్సు పిల్లలకు వాట్సప్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌ల ఉపయోగం పట్ల జాగ్రత్తలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

968
Tags

More News

VIRAL NEWS