శాస్త్రీయతతోనే నాగరికత అభివృద్ధి


Tue,November 5, 2019 01:46 AM

దేశదేశాల్లో ప్రకృతితో మానవుడు చేసిన పోరాటం ఫలితంగా మానవ నాగరికతా వికాసం జరిగింది. ప్రకృతిని విమర్శనాత్మకంగా చూడటంలోనే, దానితో ఘర్షణ పడటంతోనే నాగరికత అభివృద్ధి చెందింది. ఆ క్రమంలోంచే శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. అయితే శాస్త్రవిజ్ఞానం మత విశ్వాసాలను పరీక్షకు పెట్టి తుత్తునియలు చేసింది.

ఈ మధ్యకాలంలో శాస్త్రీయత అనేక రూపాల్లో ప్రశ్నార్థకమ వుతున్నది. ఒకప్పుడు వ్యక్తిగత విషయంగా ఉన్న మత సంప్రదాయాలు ఇవ్వాళ అధికారిక కార్యకలాపాల్లో చోటు సంపాదించుకుంటున్నాయి. దీనికి ఉదాహరణగా ఈ మధ్యనే కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో వాటిపై ‘ఓం’ రాసి, పూవులను చల్లి, వాటి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచిన దృశ్యాలను మన టీవీలు పెద్దఎత్తున దృశ్యమానం చేశాయి. గతంలో ఇలాంటివాటిని చూసి ఎరు గం. స్వాతంత్య్రోద్యమకాలం నాటి నేతలు మతపరమైన విశ్వాసాలను తమ వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తూ, అధికారిక కార్యక్రమాల్లో వాటి జోలికి వెళ్లేవారు కాదు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ అయితే, మత సంబంధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండేవారు. అలాంటి ఉదంతాన్నే విఖ్యాత భారత శాస్త్రవేత్త విక్రం సారాభాయి తన మిత్రునికి రాసి న ఉత్తరంలో రాశారు. మతసంబంధ కార్యక్రమాలకు స్వతంత్ర భార తం ఎలా దూరంగా ఉండాల్నో తెలిపారు.

సుధీర్‌ కాకర్‌ తన ఆత్మకథ ‘ఏ బుక్‌ ఆఫ్‌ మెమొరీ’లో ఒక కుతూహలమైన కథ ఒకటి చెప్పారు. అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ భవన ప్రారంభోత్సవానికి గుజరాత్‌ వస్త్ర పరిశ్రమ యజమానులు ఓ బ్రాహ్మణున్ని ఆహ్వానించారు. నెహ్రూ బ్రాహ్మణునితో పరిశ్రమ ప్రారంభోత్సవం చేయించటం పట్ల అయిష్టత వ్యక్తంచేస్తూ దూరం గా ఉన్నారు. అప్పుడు నెహ్రూను పిలిచి ముఖద్వారానికి భుజం ఆనించాలన్నప్పుడు అక్కడినుంచి దూరంగా జరిగి తప్పుకున్న ఘటనను సారాభాయి తెలిపిన విషయాన్ని కాకర్‌ తన ఆత్మకథలో రాశారు. నవ భారతం దిశగా దేశం ప్రయాణించాలన్నప్పుడు మన గమనం ఎలా ఉం డాలన్న దానికి ప్రతీకగా దీన్ని చెప్పుకోవచ్చు.

జవహర్‌లాల్‌ నెహ్రూ సైంటిఫిక్‌ టెంపర్‌ గురించి ఎప్పుడూ ప్రస్తావిం చేవారు. తర్కబద్ధమైన సహేతుకతనే శాస్త్రీయ పరిజ్ఞానమన్నారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలు, ఆచరణలో హేతుబద్ధతతో వ్యవహరించాల ని ఉద్బోధించారు. 20వ శతాబ్దపు మధ్యకాలం నుంచి దేశంలో శాస్త్రీయ భావజాలం, శాస్త్ర పరిజ్ఞానం పెరిగి సామాజిక, ఆర్థిక మార్పులు వేగం పుంజుకున్నాయి. శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు తమదైన హేతుబద్ధతతో స్వాతంత్య్రోద్యమ స్వరూపాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే నెహ్రూ.. భారతదేశం గత చరిత్ర అనుభవాల పునాది మీదనే ఆధునిక భారతా న్ని నిర్మించాలన్నారు. మృతప్రాయమైన అనేక గత సంప్రదాయాలు, ఆచారాలు మనిషిని బంధించివేశాయి. అవన్నీ ఇప్పుడు పోవాలి. అంటే దానర్థం.. గతాన్నంతా తప్పుపట్టాలని కాదు, తోసేయాలనీ కాదు, గత అనుభవాల గుణపాఠాల పునాదుల మీదనే సరికొత్త భారత సౌధాన్ని నిర్మించాలి. తరతరాలుగా మన జాతి వికాసాన్ని దోహదం చేసిన ప్రాచీన ఇతిహాసాలను, చరిత్రను మర్చిపోరాదు. మన పూర్వీకుల భవిష్యత్‌ దర్శ నం, తాత్త్వికతను మనకాలపు వెలుగుదారిగా మల్చుకోవాలి. మన బౌద్ధి క వికాసానికి పునాదిగా చేసుకోవాలి. శాస్త్ర పరిజ్ఞానం అంటే గతాన్నంతా పనికిరానిదిగా కొట్టేయాలని ఎప్పుడూ చెప్పదు. గతకాలపు వారసత్వ విజ్ఞానం పునాదులపైనే ఆధునిక విజ్ఞాన వికాసానికి బాటలు వేయాలని నెహ్రూ ఉద్బోధించాడు.

వాస్తవానికి శాస్త్రీయ భావజాలం, మతవిశ్వాసం అనేవి రెండూ విభి న్న సమాంతర మార్గాలుగా కొనసాగుతున్నాయి. రెండింటినీ కలగలిపి చూడలేం. మత విశ్వాసాలను పరీక్షలకు నిలిపి నిరూపణ చేయలేం. అదే సమయంలో అన్నింటికీ శాస్త్రంలో సమాధానం లేదు. ప్రజల్లో నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంగా ఉండవు. అయితే హేతుబద్ధమైన ప్రశ్నలను శాస్త్రం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది.


మన సామాజిక మార్పులో, ఉన్నతిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సీవీ రామన్‌, సత్యేం ద్రనాథ్‌బోస్‌, మేఘనాథ్‌ షా ప్రముఖ పాత్ర పోషించా రు. ఆ కాలంలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కీలక భూమిక పోషించింది. దేశంలోని రాజకీయనేతలు, శాస్త్రవేత్తల మధ్య ఆరోగ్యకరమైన చర్చలకు వేదికగా అది అద్వితీయమైన పాత్ర నిర్వహించింది. శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ సామాజిక దృక్కోణంలోంచి పురుడుపోసుకున్నాయి. సమాజాభివృద్ధిలో కీలకంగా మారాయి. ఆ నేపథ్యంలోనే 1958లో భారత పార్లమెంట్‌ సమాజాభివృద్ధిలో శాస్త్రీయ విజ్ఞానం పాత్రను దృష్టిలో పెట్టుకొని సైన్స్‌ పాలసీని రూపొందించింది. ఆ క్రమంలోనే 1976లో ప్రజ ల్లో, సమాజంలో శాస్త్రీయ స్పృహ (సైంటిఫిక్‌ టెంపర్‌)ను పెంచటం లక్ష్యాన్ని ఆర్టికల్‌-51ఏ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఆ క్రమంలోం చే నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్‌సీఎస్‌టీసీ)ని స్థాపించారు. కానీ ఆశించిన మేర సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని, ఆచరణను పెంపొందించటానికి ప్రయత్నాలు జరుగలేదు. భారతీయుల సామాజిక తాత్త్విక మానసిక దృక్పథం శాస్త్రీయంగా ఉన్నతంగా మారలేదు.

నిజానికి శాస్త్రీయ దృక్పథానికి, లౌకికతకు మధ్య అవినాభావ సంబం ధం ఉన్నది. మన రాజ్యాంగంలో రాసుకున్న లౌకికత్వానికి స్ఫూర్తి ఇదే. కులాతీత, మతాతీత సామాజికాచరణ పునాదుల్లోంచి లౌకికత్వం బలోపేతమైతే, దీని పునాదుల మీదనే శాస్త్రీయ మానవీయ సమాజం వికసిస్తుంది. శాస్త్ర విజ్ఞానం సమాజాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూనే, లౌకిక ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పుతుంది. సమాజాన్ని పట్టిపీడిస్తు న్న మూఢ విశ్వాసాలు, మత మౌఢ్యాలు నశించిపోయి శాస్త్రీయ భావజా ల ఆచరణే సమాజ వికాసానికి దోహదం చేస్తుంది.

ఇవ్వాళ మత ఉన్మాదులు, దురహంకారులు పేట్రేగిపోయి సామాజిక సంస్కృతినే అపహాస్యం చేస్తున్నారు. సారవంతమైన మన సంప్రదాయ వారసత్వ ఆలోచనావిధానాలకు మత మౌఢ్యాలను అద్దుతున్నారు. ఈ క్రమంలోనే 1990లో అప్ప టి మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి జ్యోతిశ్శాస్ర్తాన్ని ఒక సైన్స్‌లో ఒక శాఖగా విశ్వవిద్యాలయాల్లో బోధించాలన్నారు. ఇక 2014 వచ్చే నాటికి ఈ నాడు అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలు కనుగొంటున్న నూతన ఆవిష్కరణలన్నీ మన పురాణ వేదాల్లో ఆనాడే ఉన్నాయని చెప్పేదాకా వచ్చారు. ముఖ్యంగా భౌతికశాస్త్రం, వైద్యశాస్త్రంలోని నూతన ఆవిష్కరణలన్నీ వేదాల్లోనే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరో అడుగు ముందుకేసి నేటి ఆధునిక క్వాంటం సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతం మన భగవద్గీతలోనే ఉన్నాయంటున్నారు. రాజకీయవేత్తలు పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొత్తగా చెబుతున్నారు. ఆవు మూత్రంతోనే క్యాన్సర్‌ నయమవుతుందని భాష్యం చెబుతున్నారు. ఆదిమానవ నాగరికత వేదసంస్కృతి భారత గడ్డమీదనే పుట్టి వికసించింద ని చెబుతున్నారు.

దేశదేశాల్లో ప్రకృతితో మానవుడు చేసిన పోరాటం ఫలితంగా మానవ నాగరికతా వికాసం జరిగింది. ప్రకృతిని విమర్శనాత్మకంగా చూడటంలోనే, దానితో ఘర్షణ పడటంతోనే నాగరికత అభివృద్ధి చెందింది. ఆ క్రమంలోంచే శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందింది. అయితే శాస్త్రవిజ్ఞానం మత విశ్వాసాలను పరీక్షకుపెట్టి, తుత్తునియలు చేసింది. గెలీలియో చెప్పి న సూర్యకేంద్రక సిద్ధాంతం కూడా నాటి సమాజంలో తీవ్ర వ్యతిరేకేత ఎదుర్కొన్నది. అలా చెప్పినందుకు గాను గెలీలియో గృహ నిర్బంధానికి గురయ్యాడు. ఆ శాస్త్ర పరంపర నేటికీ కొనసాగుతూ, ప్రతిఘటనలను ఎదుర్కొంటూ ముందుకుపోతున్నది.

వాస్తవానికి శాస్త్రీయ భావజాలం, మతవిశ్వాసం అనేవి రెండూ విభి న్న సమాంతర మార్గాలుగా కొనసాగుతున్నాయి. రెండింటినీ కలగలిపి చూడలేం. మత విశ్వాసాలను పరీక్షలకు నిలిపి నిరూపణ చేయలేం. అదే సమయంలో అన్నింటికీ శాస్త్రంలో సమాధానం లేదు. ప్రజల్లో నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు సిద్ధంగా ఉండవు. అయితే హేతుబద్ధమైన ప్రశ్నలను శాస్త్రం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది. గుడ్డి విశ్వాసాల దేశాన్ని ముందుకు నడిపించలేవు. ఎన్నో త్యాగాలతో నిర్మితమైన భారతీయ సామాజిక పురోగమనాన్ని కొందరు మధ్యయుగాల నాటికి వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోంచే శాస్త్రీయ భావనలకు, హేతుబద్ధ ఆచరణలకు ఇప్పుడు గడ్డుకాలం ఏర్పడింది. తార్కికంగా ప్రశ్నించటాన్ని కూడా సహించని స్థితి వచ్చింది. ఒకప్పుడు ఇస్లామిక్‌ సంస్కృతి వికాసాలకు కేంద్రంగా విలసిల్లిన ఇరాన్‌ నేడు, మతోన్మాదం ఆధిపత్యంలో చీకటి యుగంలోకి నెట్టివేయబడింది. మహమ్మదీయ మతోన్మాదం సాంస్కృతిక వికాసాన్ని నాశనం చేసింది. పాకిస్థాన్‌ కూడా దీనికి మినహాయింపు కాదు.
rajendhar
సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటంలో వైఫల్య ఫలి తం నేడు కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. మతోన్మాదం పెరిగిపోవటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. 1936లో మహాత్మాగాంధీని సీవీరామన్‌ కలిసినప్పుడు.. ‘మహాత్మాజీ.. మతాలు మనుషులను ఏకం చేయలేవు. మనుషుల సమగ్రాభివృద్ధికి విజ్ఞానశాస్త్రమే పునాది. శాస్త్రమే మనుషులను సహోదరులను చేస్తుంది’ అని అన్నాడు. అంటే విజ్ఞానశాస్త్రం తెలియని వారు అన్నదమ్ములుగా మెలగలేరా? అని గాంధీ అన్నప్పుడు.. శాస్త్ర విజ్ఞానంతోనే మనుషులు పరిపూర్ణమానవులవుతారని రామన్‌ బదులిచ్చారు.

వర్తమాన సమాజంలో ఇప్పుడు మానవులంతా మతమౌఢ్య సంకెళ్ల ను తెంచుకొని ఆధునికత వైపు పయణించాలి. ఆ లక్ష్యం దిశగా రాజ్యాంగంలో రాసుకున్న సైంటిఫిక్‌ టెంపర్‌ను పాదుకొల్పేందుకు, పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఆ దిశగా కృషిచేయాలి.
(వ్యాసకర్త: బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌
అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ కేంద్రంలో ప్రొఫెసర్‌) ‘ది వైర్‌' సౌజన్యం...

376
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles