ఘర్‌కిముర్గీ దాల్ బరాబర్


Sat,November 2, 2019 12:51 AM

యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ నిర్ణయంతో యురోపియన్ యూనియన్ ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. యురోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు, పార్లమెంట్ సభ్యులకు నిజానికి ఎంతమాత్రం విలువ లేదు. అయినప్పటికీ మోదీజీ ప్రభుత్వం దృష్టిలో యురోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులకు ఉన్న విలువ ఇండియన్ పార్లమెంట్ సభ్యులకు లేకపోవడం శోచనీయం. దీనినే అంటారు ఘర్కీ ముర్గీ దాల్ బరాబర్ అని. భారత ఆర్థికవ్యవస్థ అరాజక వ్యవస్థగా మారి అదుపు తప్పిందని ఇటీవల ఆర్థికశాస్త్రం నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ చేసిన వ్యాఖ్య పాలకులకు ఆగ్రహం కలిగించింది. పాలకులకు ఆగ్రహం కలుగటం ఇది మొదటిసారి కాదు, భారత ఆర్థికవ్యవస్థ విపరీతమైన మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదని ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, మూడీ ఆర్థికసంస్థ వంటి అంతర్జాతీయ ఆర్థికసంస్థలు, మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్ వంటి ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించినప్పుడు కూడా మోదీజీ ప్రభుత్వం అంతులేని అసహనాన్ని వ్యక్తపరిచింది.

Devulapalliprabakar
జా గో జాగో సుబాహ్ హుఇ ఫతేహ కా పరచమ్ లెహరాయా (Wake up, wake up, the dawn has arrived, our victory flag is flying high! ముప్ఫై ఏండ్ల కిందట ఇది కశ్మీర్ అంతటా ప్రతి ఇం ట, ప్రతి నోట వినిపించిన స్వాతంత్య్ర సమరగీతం! గత ముప్ఫై ఏండ్ల, విశేషించి గత ఆరేండ్ల కశ్మీర్ చరిత్రలో అనేక అసాధారణ పరిణామాలు సంభవించాయి. ఇంకెన్నో పరిణామాలు సంభవించబోతున్నాయి. కశ్మీ ర్ ప్రాచీన చరిత్రను, విశేషించి కల్హణ పండితుడు క్రీస్తు తర్వాత 12వ శతాబ్దంలో రచించిన రాజతరంగణి చరిత్ర గ్రంథాన్ని పరికిస్తే అనేక మతాల వారు, పలు రాజవంశాల వారు కశ్మీర్‌లో జనరంజకంగా పరిపాలన కొనసాగించారని స్పష్టమవుతుంది. మతతత్వాన్ని, మత దురభిమానాన్ని, జిహాదీ నినాదాలను మైనస్ చేస్తే కశ్మీర్‌లో మతోన్మాదం ఎన్న డూ ప్రాబల్యం వహించలేదు. కశ్మీరీలు స్థూలంగా చెప్పాలంటే స్వాతం త్య్ర పిపాసువులు, స్వేచ్ఛాప్రియులు జాగో జాగో సుబాహ్ హుఇ, ఫతేహ కా పరచమ్ లెహరాయా అని కశ్మీరీలు స్వాతంత్య్ర గీతాలు ఆలపించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కశ్మీరీలు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

ఒకవంక బ్రిటిష్ పాలకుల ప్రోత్సాహంతో మహమ్మద్ అలీ జిన్నా మతోన్మాదాన్ని రెచ్చగొట్టినా, కొందరు హిందూ నేతలు బ్రిటిష్ పాలకుల ముందు తలవంచి క్షమార్పణ పత్రాలు రాసిచ్చి నా కశ్మీరీలు మతాతీత లౌకిక విధానాలకు ఎన్నడూ తిలోదకాలు ఇవ్వలేదు-గాంధేయమార్గంలో పయనిస్తూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్ మహారాజు హరిసింగ్ స్వతంత్ర భారత దేశం లో విలీనం కావడానికి రెండు మాసాలు జాప్యం జరిపినా కశ్మీరీలు తమ రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత షేఖ్ అబ్దుల్లా నాయకత్వంలో ముందే నిర్ణయించారు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. అనేక సంవత్సరాల అనంతరం మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జమ్ముకశ్మీర్‌లో ఇన్సానియత్, జంహూరియత్, కశ్మీరియత్ అత్యంత ప్రధానమైనవని అభిప్రాయపడ్డారు. ఈ రోజు కశ్మీర్‌లో ఇన్సానియత్, జంహూరియత్, కశ్మీరియత్ మృగ్యమవుతున్నాయి.

స్వతంత్ర భారతదేశంలో జమ్ముకశ్మీర్ విలీనానికి (1947 అక్టోబర్‌లో) నిర్ణయించడంలో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత షేఖ్ అబ్దుల్లా, మహరాజా హరిసిం గ్ ముగ్గురు, ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ నిర్వహించిన పాత్ర అత్యంత కీలకమైంది. కశ్మీర్ ప్రజల సమ్మతి, అనుమతి, అంగీకారంతోనే ఏ నిర్ణయమైనా జరుగాలని గొప్ప ప్రజాస్వామ్యవాది జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయపడినారు. ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ, షేఖ్ అబ్దుల్లా మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు ముఖ్యమైనవి. కశ్మీర్ విలీ నం విషయంలో జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయాలతో ఉప ప్రధానమం త్రి, దేశవ్యవహారాల మంత్రి సర్దార్‌పటేల్ పూర్తిగా ఏకీభవించడం విశే షం. సంబంధిత వ్యక్తులు, శక్తులు, పార్టీలు అన్నిటితో సంప్రదించిన పిదపనే జవహర్‌లాల్ నెహ్రూ ఒక నిర్ణయానికి వచ్చారు. 72 ఏండ్ల కిందట కశ్మీర్ విలీనానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినప్పుడు అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

స్వతంత్ర భారతదేశంలో కశ్మీర్ విలీనానికి అప్పుడు ప్రాతిపదిక 370వ ఆర్టికల్. 72 ఏండ్ల తర్వా త ఇప్పుడు ఈ అక్టోబర్‌లో, 31వ తేదీన 370వ ఆర్టికల్ రద్దును అమ లుపరిచి జమ్ముకశ్మీర్ రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేస్తున్నప్పుడు మోదీజీ కేంద్ర ప్రభుత్వం సంబంధిత వ్యక్తులు, పార్టీలు, శక్తులు, నేతలు ఎవరితోనూ సంప్రదించకపోవడం, తమ నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారందరిని (ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా రాజకీయ నాయకులు, కార్యకర్తలందరిని అనధికారికంగా అరెస్టు చేసి నిర్బంధించడం దారుణం!). అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. అప్పుడది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడిది పచ్చి నిరంకుశ వ్యవస్థ! అప్పుడు ప్రజాస్వా మ్య వ్యవస్థ చేతనత్వంతో తొణికిసలాడింది. ఇప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యమై నిర్జీవమైనాయి. క్రీస్తుశకం 8 వేల ఏండ్ల కిందట కశ్మీర్ లోయ పూర్తిగా ఒక సువిశాల జలనిధి వలె కనిపించి ఘనీభవించిందట; ఎనిమిది వేల సంవత్సరాల తర్వాత ఈరోజు కశ్మీర్ లోయ రాజకీయంగా ఘనీభవించింది. కశ్మీరీల ప్రాథమిక మానవహక్కులు, భారత రాజ్యాం గం ప్రసాదించిన హక్కులు, పౌరహక్కులు అన్నీ మంటకలిశాయి. కశ్మీ రు ప్రజల మానవహక్కులను, పౌరహక్కులను, రాజకీయశక్తులను వెం టనే పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగశాఖ గత మూడు మాసాల కాలంలో (2019 ఆగస్టు 5 నుంచి) భారత ప్రభుత్వానికి దాదాపు పది పర్యాయాలు విజ్ఞప్తి చేసింది. అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ, బ్రిటన్‌లో లేబర్ పార్టీ నాయకులు కశ్మీర్‌లో ప్రజాస్వామ్య హననాన్ని తీవ్రంగా ఖం డిస్తున్నారు.

అంతేకాదు అమెరికాలో, బ్రిటన్‌లో పత్రికలు, మీడియా సంస్థలు కశ్మీర్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా, అమెరికా, బ్రిటన్, చైనా, టర్కీ, మలేషియా తదితర దేశాలన్ని కశ్మీర్‌లో మోదీజీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ మోదీజీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. మూడు నెలల నుంచి కశ్మీర్‌లో సాధారణ జనజీవితం ఎన్నడూ లేని రీతిగా స్తంభించిం ది, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. సామాజిక జీవనం చైతన్యరహితమైంది. అయినప్పటికీ ప్రపంచమంతటా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వ్యతిరేకతను, విమర్శలను, ఖండనమండనలను ఎదుర్కోవడానికి మోదీజీ ప్రభుత్వం ఎన్నో తంటాలు పడుతున్నది; ఈ తంటాల్లో ఒకటి ఇటీవల యురోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రతినిధి వర్గాన్ని కశ్మీ ర్ ఆహ్వానించడం. యురోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రతినిధి వర్గాన్ని ఆహ్వానించడంలో తమ పాత్ర లేదు. ఈ ఆహ్వానంతో తమకు సంబంధం లేదని మోదీజీ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ వాదిస్తున్నాయి. మోదీజీ ప్రభుత్వ అనుమతి లేకుండా యురోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రతినిధి వర్గం కశ్మీర్ రాగలిగిందా? ఈ దేశం పార్లమెంట్ సభ్యులను, రాజకీయ నాయకులను కశ్మీర్‌లోకి ఎందుకు అనుమతించడం లేదు? తమను కశ్మీర్‌కు ఆహ్వానించడం కేవలం ఒక స్టంట్, జిమ్మిక్కు అని యురోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుడు ఒకాయన (బ్రిటన్) అన్నాడు. ఆయన చేసిన వ్యాఖ్య ఇది

I am not prepared to be part of a PR stunt for the Modi Govern -ament and pretend that all is well. It is very clear, democratic principles are being subverted in Kashmir and the world needs to start taking notice.... ఈ వ్యాఖ్య చేసిన సభ్యుడికి పంపిన ఆహ్వానాన్ని మోదీజీ ప్రభుత్వం రద్దుచేసింది. తాము ఆహ్వానించనప్పుడు ఆహ్వానాన్ని రద్దుచేసే అధికారం తమకు ఏ విధంగా లభించింది? యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ నిర్ణయంతో యురోపియన్ యూనియన్ ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. యురోపియన్ యూనియన్ పార్లమెంట్‌కు, పార్లమెంట్ సభ్యులకు నిజానికి ఎంతమాత్రం విలువ లేదు. అయినప్పటికీ మోదీజీ ప్రభుత్వం దృష్టిలో యురోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులకు ఉన్న విలువ ఇండియన్ పార్లమెంట్ సభ్యులకు లేకపోవడం శోచనీ యం. దీనినే అంటారు ఘర్కీ ముర్గీ దాల్ బరాబర్ అని. నిరంకుశ ధోరణితో వ్యవహరించి మూడు ముక్కలు చేసి జమ్ముకశ్మీర్ స్వరూ ప స్వభావాలను మార్చిన భారత ప్రభుత్వాన్ని కశ్మీర్ ప్రజలు శతృ దేశం గా పరిగణిస్తున్నారు.

భారత ఆర్థికవ్యవస్థ అరాజక వ్యవస్థగా మారి అదు పు తప్పిందని ఇటీవల ఆర్థికశాస్త్రం నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ చేసిన వ్యాఖ్య పాలకులకు ఆగ్రహం కలిగించింది. పాలకులకు ఆగ్రహం కలుగటం ఇది మొదటిసారి కాదు, భారత ఆర్థికవ్యవస్థ విపరీతమైన మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, మూడీ ఆర్థికసంస్థ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మాజీ ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్ వంటి ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించినప్పుడు కూడా మోదీజీ ప్రభుత్వం అంతులేని అసహనాన్ని వ్యక్తపరిచింది. వాస్తవాలను గుర్తించలేని, గౌరవించలేని, తప్పులు దిద్దుకోలేని ప్రభుత్వాలకు అసహనం ఒక్కటే ఆయుధం. పాలకుల అసహనం వల్ల విషమ పరిణామాలు సంభవిస్తాయనడంలో సందేహం లేదు. ఈరోజు, గత మూడు నెలల నుంచి కశ్మీర్ లోయ ప్రజాస్వామ్యా న్ని కోల్పోయి, అనేక అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కొంటున్నది. ఈ అన్యాయాలు, అక్రమాల దుష్ట పరిణామాలు భవిష్యత్ భారతదేశం మీద ప్రసరిస్తాయనడంలో అనుమానం లేదు.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles