సఫలమైన నీటి నిర్వహణ


Fri,November 1, 2019 02:05 AM

సూర్యాపేట కాలువల తవ్వకం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేనేండ్ల కిందనే ప్రారంభించినా అవి పూర్తయి నీటిని అందించడానికి సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్నది గమనించాలి. అందుకు ఇంజినీర్లు అహోరాత్రులు శ్రమించి కాలువల పనులు పూర్తిచేయించారు. డీబీఎం-71పై అత్యంత సున్నితమైన GAIL, HPCL పైప్‌లైన్ల క్రాసింగ్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిచేయించింది. ఇక నేడు ఈ కాలువల్లో ప్రవహిస్తున్న నీరు ఏ ప్రాజెక్టువి అన్న ప్రశ్న అర్థం లేనిది.

ఒకట్రెండు సంవత్సరాల్లో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంతో అనుసంధానం అవుతాయి. ఈయేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చినందుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే అవసరం రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎత్తిపోతల ప్రక్రియ ఎట్లా ఉంటుందో తెలిస్తే ఇవి ఏ ప్రాజెక్టు నీళ్లు అన్న ప్రశ్న అర్థం లేనిదని తెలిసిపోతుంది. ఆయకట్టు రైతాంగానికి ఈ విషయంలో స్పష్టత ఉన్నది.

sridhar-rao-deshpande
సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాల్లో శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల్లో గోదావరి జలాల నీటి నిర్వహణ పనులను పర్యవేక్షించడానికి అక్టోబర్ 29న ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్‌రావుతో కలిసివెళ్లాను. అక్కడి నీటి నిర్వహణ సంగతులు రాసేముందు ఉద్యమ సమయంలో ఒక ఘట్టాన్ని పాఠకులతో పంచుకుంటాను. 2012లో తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ యూనిట్ వారు కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేస్తూ ఒక సదస్సును ఏర్పాటుచేశారు. ఆ సదస్సులో ఆర్.విద్యాసాగర్‌రావు, శ్యాంప్రసాద్‌రెడ్డి, నేను వక్తలుగా పాల్గొని ప్రసంగించాం. ఈ సదస్సు ప్రత్యేకత ఏమంటే.. సూర్యాపేట జిల్లా డి.కొత్తపల్లి గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు నీరందించే ఒక ప్రధానమైన డిస్ట్రి బ్యూటరీ డీబీఎం-71 కాలువలో టెంట్లు వేసి సదస్సును ఏర్పాటుచేశా రు. కాలువ ఉన్నట్టే కానీ, తుమ్మలతో నిండిపోయి ఒక అడవిని తలపిస్తున్నది. ఆ సదస్సులో ప్రసంగించిన రైతులందరూ ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు ఈ కాలువల్లోకి చేరుతుందన్న ఆశ మాకు లేదు. గోదావరి మీద కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి శ్రీరాంసాగర్ కాలువల్లో నీరు వదులాలని డిమాండ్ చేశారు. ఇక సీన్ కట్‌చేస్తే.. ఏడేం డ్ల తర్వాత మళ్లీ డి.కొత్తపల్లి వద్ద డీబీఎం-71 కాలువ వద్ద సదస్సు నిర్వహించిన చోట నిలబడి చూశాను. కాలువలో పూర్తిస్థాయిలో గోదావరి నీరు ప్రవహిస్తున్నది. ఎంత మార్పు! హృదయం ఉప్పొంగింది. ఈ కాలువల్లో గోదావరి నీటిని చూస్తామా అన్న అనుమానం వ్యక్తంచేసిన రైతులు ఇవ్వాళ ఊరూరా గోదావరి మాతకు పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఊరి చెరువులు గోదావరి జలాలతో నిండుతుంటే వారి సం తోషానికి అవధుల్లేవు. ఇవి కాళేశ్వరం నీళ్ళా? శ్రీరాంసాగర్ నీళ్ళా? అన్న మీమాంసలో వారు లేరు. అవి గోదావరి జలాలని వాళ్లకు తెలుసు. తెలంగాణ వచ్చినందుకే గోదావరి నీళ్లు తమ చెంతకు చేరుతున్నయని కూడా వాళ్లకు తెలుసు.

శ్రీరాంసాగర్ మొదటిదశ ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలు. కాకతీ య కాలువ 0-284 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆయకట్టు విస్తరించి ఉన్న ది. లోయర్ మానేరు డ్యాం వరకు ఆయకట్టు 4.63 లక్షల ఎకరాలు, లోయర్ మానేరు డ్యాం కింద 284 కి.మీ.ల వరకు 5.05 లక్షల ఎకరా ల ఆయకట్టు ఉన్నది. ఇక రెండో దశలో కి.మీ.284-348 వరకు కాకతీ య కాలువ పరిధిలో ఉన్న ఆయకట్టు 4.40 లక్షల ఎకరాలు. రెండు దశ ల్లో ఉన్న కాలువలకు నీరు శ్రీరాంసాగర్ జలాశయం నుంచే అందాలి. అయితే శ్రీరాంసాగర్ డ్యాంకు మహారాష్ట్ర నుంచి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయినాయి. గత 38 ఏండ్ల వరద చరిత్రను పరిశీలిస్తే 25 ఏండ్లు (66 శాతం) కరువు, 13 ఏండ్లు (34 మాత్రమే వరద వచ్చింది. కాబట్టి శ్రీరాంసాగర్ మొదటి దశ ఆయకట్టు అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి నెలకొన్నది. ఇక రెండో దశ ఆయకట్టుకు నీరం దని ద్రాక్ష పండే. కాలువలు కూడా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండో దశ ప్రధాన కాలువలు, ఉప కాలువలు అనేక సమస్యల కారణంగా అవి పూర్తికాలేని పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపినప్పుడు శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు నీరివ్వడమెట్లా అన్నఅంశంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా, సునిశితంగా చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతాంగం ఆశలు నేరవేరుతాయన్న విశ్వాసంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. శ్రీరాంసాగర్ రెండోదశ ఆయకట్టుకు శ్రీరాంసాగర్‌కు వరద రాని కాలంలో కాళేశ్వరం నీటిని లోయర్ మానేరు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో 18.20 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్, వరద కాలువ, ఎల్లంపల్లి, చెరువుల కిం ద ఉన్న ఆయకట్టును కూడా స్థిరీకరించే లక్ష్యంతో ప్రాజెక్టు ప్రతిపాదన లు సిద్ధం చేశారు. అందులో ప్రధానమైనవి శ్రీరాంసాగరు పునరుజ్జీవన పథకం, శ్రీరాంసాగర్ కాలువల ఆధునీకీకరణ, మిడ్‌మానేర్ జలాశ యం. వీటి మీద ప్రభుత్వం దృష్టిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పూర్తి చేయడానికి ఇంజినీర్లకు ఆదేశాలు జారీచేసింది. అనుకున్నట్టే వీటి పను లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజున శ్రీరాంసాగర్ రెండోదశ ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటర్లు, మైనర్లు.. అన్ని పూర్తిస్థా యిలో నీటిని చెరువుల్లోకి తరలిస్తున్నాయి. ఇంజినీర్లు ఈసారి ఒక కొత్త ప్రయోగం Tail to Head పద్ధతిని ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి అమలుచేస్తున్నారు. ముందు రైతులకు, ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై అవగాహన కలిగించారు. పత్రిక లూ ప్రచారం చేశాయి. ఇంజినీర్లు స్వేచ్ఛగా, పకడ్బందీగా రాత్రిపగళ్లు కాల్వలపై తిరుగుతూ నీటి నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. చెరువులను నింపే పనిలో నిమగ్నమైనారు. లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీ య కాలువలోకి అక్టోబర్ 13న నీటి విడుదల ప్రారంభమైంది. Tail to Head పద్ధతిలో నీటిని అందించాలని ముందే నిర్ణయించారు కాబట్టి పైన ఉన్న తూములన్నీ మూశారు. అక్టోబర్ 15 నాటికి నీరు 284 కి.మీ. వరకు చేరింది. అక్కడినుంచి మొదట ప్రధాన కాలువ చివరివరకు నీటిని తరలించారు.

ఆ తర్వాత చివరి డిస్ట్రిబ్యూటరీల తూములు ఒక్కొక్కటి తెరుస్తూ పైకి రావడం జరిగింది. ఇప్పుడు డీబీఎం-71, డీబీఎం-69, డీబీఎం-6ం లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటరీలు, వాటి మైనర్లలో నీరు పూర్తి స్థాయిలో నీటిని చెరువుల్లోకి తరలిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ మండలం, మాచారం గ్రామంలో రాగిచెరువు శ్రీరాంసాగర్ రెం డోదశ ఆయకట్టులో ఉన్న చిట్టచివరి చెరువు. ఆ చెరువులోకి గోదావరి జలాలు 300 కి.మీ. ప్రవహించి చేరడం సామాన్యమైన విషయం కాదు. ఇంజినీర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్టోబర్ 15 నుంచి ఇప్పటిదా కా నియోజకవర్గాల వారీగా నిండిన చెరువుల వివరాలు. కోదాడ-6, సూర్యాపేట-40, తుంగతుర్తి-79, డోర్నకల్-54, పాలకుర్తి-75, వర్ధన్నపేట-8, మొత్తం 262 చెరువులు. రానున్న రోజుల్లో రెండో దశ ఆయకట్టు పరిధిలో మొత్తం 592 చెరువులను నింపడానికి ఇంజినీర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక లోయర్ మానేరు డ్యాం నుంచి 284 కీ.మీ. వరకు మొదటి దశ ఆయకట్టు పరిధిలో మరో 500 చెరువులు నింపే అవకాశం ఉన్నది.

ఇకపోతే సూర్యాపేట కాలువల్లో గోదావరి జలాలు ప్రవహిస్తుంటే కొందరు ఈ నీరు ఏ ప్రాజెక్టువి? ఈ కాలువలు ఎప్పుడు తవ్వారు? ఎవ రు తవ్వారు? మిడ్ మానేరులో నీళ్ళే లేవు. ఇవి కాళేశ్వరం నీరు ఎట్లా అవుతుంది? అని ప్రజలకు పట్టని అనవసరపు చర్చ లేవదీస్తున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతంలో తవ్విన కాలువలు శ్రీరాంసాగర్ రెండోదశ ఆయకట్టుకు నీరందించడానికి ఉద్దేశించబడినవని పైన వివరించాను. సూర్యాపేట కాలువల తవ్వకం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేనేండ్ల కిందనే ప్రారంభించినా అవి పూర్తయి నీటిని అందించడానికి సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వమే అన్నది గమనించాలి. అందు కు ఇంజినీర్లు అహోరాత్రులు శ్రమించి కాలువల పనులు పూర్తిచేయించారు. డీబీఎం-71పై అత్యంత సున్నితమైన GAIL, HPCL పైప్‌లైన్ల క్రాసింగ్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిచేయించింది. ఇక నేడు ఈ కాలువల్లో ప్రవహిస్తున్న నీరు ఏ ప్రాజెక్టువి అన్న ప్రశ్న అర్థం లేనిది. ఈయేడు వచ్చినట్టు శ్రీరాంసాగర్‌కు వరద వస్తే అవి శ్రీరాంసాగర్ నీళ్లు గా పరిగణించాలి. శ్రీరాంసాగర్‌కు వరద రాని రోజుల్లో వచ్చే నీరు కాళేశ్వరం నీరవుతుంది. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్‌హౌజ్, గాయత్రి పంప్‌హౌజ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద రాకముందే 13 టీఎంసీలు ఎత్తిపోయడం జరిగింది. అందులో నుంచి 10 టీఎంసీలు లోయర్ మానేరుకు పంపడం జరిగింది.

ఆ నీరే ఇప్పుడు సూర్యాపేట కాలువలకు వస్తున్నవి. శ్రీరాంసాగర్‌కు వరద మొదలైనాక కాకతీయ కాలువ ద్వారా కూడా లోయర్ మానేరుకు నీరు చేరుతున్నది. లోయర్ మానేరు జలాల మీద ఇవి శ్రీరాంసాగర్ నీరు, ఇవి కాళేశ్వరం నీరు అని రాసి ఉండదు. తెలంగాణలో గోదావరి బేసిన్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఒకదానితో మరొకటి అనుసంధానం జరిగినందున నీరు ఏ ప్రాజెక్టు నుంచి వచ్చినా అవి గోదావరి జలాలుగానే పరిగణించాలి. కాళేశ్వరం, ఎల్లంపల్లి, మధ్యమానేరు, దిగువ మానేరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా Integreted Godavari Basin Development Planలో భాగంగా చూడాలి. శ్రీరాంసాగర్‌కు వరద రాని కాలంలో గోదావరి నీటి ని ఎత్తిపోయడానికి పునరుజ్జీవన పథకం సిద్ధమైంది. ఒకట్రెండు సంవత్సరాల్లో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంతో అనుసంధానమవుతాయి. ఈయేడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చినందుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే అవసరం రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎత్తిపోతల ప్రక్రియ ఎట్లా ఉంటుందో తెలిస్తే ఇవి ఏ ప్రాజెక్టు నీళ్లు అన్న ప్రశ్న అర్థం లేనిదని తెలిసిపోతుంది. ఆయకట్టు రైతాంగానికి ఈ విషయంలో స్పష్టత ఉన్నది.

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles