ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలె

Sat,April 13, 2019 12:22 AM

దేశవ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నిక ల్లో భాగంగా మొదటి దశ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచే సుకోకుండా శాంతియుతంగా పోలింగ్ జరుగ టం హర్షణీయం. దీనివెనుక రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కృషి అనిర్వచనీయమైనది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఎన్నోచోట్ల అల్లరు జరిగాయి, నేతల మీద దాడులు జరిగాయి. కొన్నిచోట్ల హత్యలూ జరి గాయి. ఇది బాధాకరమైన విషయం. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకో వడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకానీ ఇష్టారీ తిన వ్యవహరించడం సరికాదు. ఘటనలకు కారణమైనవారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించాలి.
- జీడిపల్లి లింగారావు, రామకృష్ణ కాలనీ, కరీంనగర్

ఓటు హక్కును వినియోగించుకోవాలె

నగరంలో ఓటింగ్ శాతం పడిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఓటు హక్కును ఎన్నో పోరాటాల ద్వారా సాధించు కున్నామనే విషయం మరిచిపోవద్దు. మన ఓటు సరైన అభ్యర్థికి వేసి గెలిపించుకున్నప్పుడే అభివృద్ధిపై నిలదీసే హక్కు ఉంటుంది. అలాంటి హక్కును వినియోగించుకోకుండా వృథా చేసుకోవడం సరికాదు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో పట్టణాలకు దీటుగా పల్లెటూర్లలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఇది హర్షణీయ మైనా విద్యావంతులు వినియోగించుకోకపోవడం బాధాకరం.
- పొట్లచెరువు శ్రీహరి, కొమ్మాయిగూడెం, యాదాద్రి

ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలె

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదా లకు అతివేగం, మద్యం తాగి వాహనాలు నడుపడం లాంటి కార ణాలని తెలిసినా ప్రయాణికులు మద్యం తాగి అతివేగంగా ప్రయా ణిస్తున్నారు. అధికారులు రహదారులపై తనిఖీలు చేస్తూ మద్యం తాగి వాహనాలు నడిపేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.
- చుంచు అరుణ్‌కుమార్, వెల్గనూర్, దండేపల్లి, మంచిర్యాల

157
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles