మద్యం పంపిణీ అరికట్టాలె

Thu,April 11, 2019 11:40 PM

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగం గా ఓటర్లను ప్రభావితం చేసేందుకు నాయకు లు డబ్బు, మద్యాన్ని ఎర జూపుతున్నారు. ఇందులో భాగంగా నిన్న జరిగిన మొదటి దశ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. విపరీతంగా డబ్బులు పంచారు. ఉదాహరణకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే ఏకంగా నాయకుల ఫొటోలున్న మద్యం సీసాలే దర్శనమిచ్చాయి. కండువాలు కప్పుకొని మరీ ఫొటోలకు ఫోజిచ్చారు కొందరు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మద్యం ఏ రేంజ్‌లో సరఫరా చేశారో. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇంకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాబ ట్టి మద్యం పంపకాన్ని, డబ్బుల వితరణను అరికట్టాల్సిన అవసరం ఉన్నది.
- జంపాల అంజయ్య,సామాజిక కార్యకర్త, భువనగిరి

చర్యలు తీసుకోవాలె

ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదమని తెలిసినా ప్రయాణికు లు గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. దీనికి కారణం ఆర్టీసీవారు పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పు డు అదనపు బస్సులు కేటాయించకపోవడమే. దిక్కులేని స్థితిలో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో గమ్యానికి చేరుకుంటున్నారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న వాహన యజమానులు అందినకాడికి దండుకుంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
- బందెల శ్రీనివాస్, కమాన్, కరీంనగర్


హర్షణీయం

పాలనలో, పనుల్లో వేగం, జవాబుదారీతనం పెరుగాలంటే అన్ని శాఖలను ఆన్‌లైన్‌చేసి మీ సేవ పరిధిలోకి తీసుకురావాల్సిన అవస రం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు హర్షణీయం. ఇలా చేయడం ద్వారా అవినీతి తగ్గిపో తుంది. లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది.
- కంది కృష్ణారెడ్డి, కరీంనగర్

150
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles