సిధారెడ్డి కవిత్వం నీటిమనసుతో తెరసం

Thu,April 11, 2019 12:08 AM

ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కవిత్వం నీటిమనసుతో తెరసం కార్యక్రమం 2019 ఏప్రిల్ 14న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతుంది. డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరుగు సభలో కె.శివారెడ్డి, కందుకూరి శ్రీరాములు, డాక్టర్ వి. శంకర్, డాక్టర్ కె. విద్యావతి, తైదల అంజయ్య, ఘనపురం దేవేందర్, పొన్నాల బాలయ్య తదితరులు పాల్గొం టారు. సిధారెడ్డి నీటిమనసుకవితా గానం చేస్తారు. థింసానీటిమనసును విశ్లేషిస్తారు. బెల్లంకొండ సంపత్‌కుమార్ సమన్వయం చేస్తారు.
- తెలంగాణ రచయితల సంఘం

కేఎస్ సంస్మరణ వ్యాసాలు ఆవిష్కరణ

కొండపల్లి సీతారామయ్య 17వ వర్ధంతి సందర్భంగా కేఎస్ సంస్మరణ వ్యాసాలు పుస్తకావిష్కరణ సభ 2019 ఏప్రిల్ 12న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. చుక్కా రామయ్య పుస్తకావిష్కరణ చేస్తారు. ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్, సి.శివారెడ్డి, కె.సుధ, రత్నమాల, సాంబమూర్తి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగిస్తారు. అందరికీ ఆహ్వానం
- డాక్టర్ శ్రీనివాస్
కేఎస్ మెమోరియల్ కమిటీ

167
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles