ఆరోగ్యశ్రీ ని విస్తృతపరుచాలె

Wed,February 20, 2019 01:02 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు ఉచి తంగా కార్పొరేట్ వైద్య సదుపాయాలు పొందుతున్నారు. కానీ కొన్ని వ్యాధులకు సంబం ధించిన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం కింద జరుగడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృత పరుచాలె. అన్నిరకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికే వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సకు అవకాశం లేని వాటికి ఎల్‌వోసీ, సీఎంఆర్ ఎఫ్ పథకాల ద్వారా పేద రోగులను ఆదుకుం టున్నది. ప్రతి పేద రోగి కార్పొరేట్ దవాఖా నల్లో ఉచితంగా వైద్యసేవలను పొందేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
- కారుపోతుల పాండరి, పనకబండ, మోత్కూర్

సంస్కృతి పేర దాడులు

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై ప్రజలు జీవించాలని రాజ్యాంగం పేర్కొన్నది. యువత వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొన్నది. కానీ నేడు వ్యక్తిగత స్వేచ్ఛపై విపరీతమైన దాడి జరుగుతున్నది. సంస్కృ తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ లాంటి సంస్థలు దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రేమికుల రోజు యువతీయు వకులు తమ భావాలను పంచుకునేందుకు పార్కులను వేదికగా చేసుకుంటారు. అయితే వారిపై సంస్కృతి పేరుతో కొందరు దాడులు చేస్తున్నారు. బలవంతపు పెండ్లిళ్లు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆగడాలకు ఎందరో అమాయకులు బల వుతున్నారు. దీంతో యువతీయువకులు ఆందోళనకు గురై ఆత్మ హత్యలకు పాల్పడుతున్న పరిస్థితులున్నాయి. ప్రేమను వ్యక్తపరుచడం అనేది స్వేచ్ఛాపూరితమైన హక్కు. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు ప్రేమలను వ్యక్తపర్చటం నేరం కాదు. దీన్ని కొందరు మత ఛాందసులు నేరంగా పరిగణించటం, సంస్కృతి పేరిట దాడు లు చేయటం అప్రజాస్వామికం. ఇలాంటి మూక దాడుల సంస్కృతిని నివారించాల్సిన అవసరం ఉన్నది.
- సంపతి రమేశ్ మహరాజ్, వెంకట్రావుపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా

183
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles