తెలంగాణ బాహుబలి కేసీఆర్


Sat,February 16, 2019 01:44 AM

ముందుగా మాన్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో కేసీఆర్ పాత్ర ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ చరిత్రలోనే కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. ఎందుకంటే.. ఒక లక్ష్యం కోసం ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమ ఫలితాన్ని కళ్లారా చూడటం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది.. అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ వ్యాఖ్య అందుకు సాక్ష్యం.
Ilapavuluri
అప్పుడు టీఆర్‌ఎస్‌కు ఉన్నది కేవలం ఇద్దరు ఎంపీలు. ఇద్దరు ఎంపీలతోనే రెండువందల బలం ఉన్న పార్టీలా పార్లమెంట్‌లో పోరాడారు కేసీఆర్. 1969లో పెద్ద ఉద్యమం జరిగింది. వందలాది మంది మరణించా రు. అప్పుడే రాలేదు, ఇక ఇంత శాంతియుతంగా ఉద్యమం సాగితే తెలంగాణ ఎలా వస్తుంది? అంటూ కొందరు సన్నాయి నొక్కులునొక్కి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, గాంధేయవాదాన్ని నమ్ముకున్న విజ్ఞుడు కాబట్టి కేసీఆర్ ఏ మాత్రం సహనం కోల్పోలేదు. ఎక్కడా హింసాకాండ చెలరేగకుండా జాగ్రత్త వహించారు. చివరికి తానే ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. 11 రోజుల పాటు దీక్ష చేసిన బక్క శరీరుడు భీమబలుడు అని నిరూపించుకున్నాడు. మనసు బలంగా ఉండాలి తప్ప తనువు కొండలాగా ఉంటే నిష్ప్రయోజనం అని కేసీఆర్ నిరూపించారు. అహింసావాదమే సిద్ధాంతంగా మహాత్మాగాంధీ దేశానికి స్వాతం త్య్రం సాధించారు. స్వాతంత్య్ర ఉద్యమం గాంధీ ప్రారంభించింది కాదు. అంతకు ఏడు దశాబ్దాల కిందటే ప్రారంభించబడింది. కాలక్రమంలో గాం ధీ ఉద్యమ నాయకుడయ్యారు. ఆయన ఆధ్వర్యంలో స్వాతంత్య్రం సిద్ధిం చి జాతిపిత అనిపించుకున్నారు గాంధీజీ. మరి అదే మార్గంలో వెళ్లి రాష్ర్టా న్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎందుకు కాకూడదు?


రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌కు 63 స్థానాలే దక్కడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. బహుశా కేసీఆర్ కూడా బాధపడి ఉంటారు. అయినప్పటికీ ప్రజలను నిం దించలేదు. ప్రజాభిమానాన్ని మరింతగా పొందాలంటే ఉత్తమమైన పరిపాలన అందించడమే మార్గంగా భావించారు. అణగారిన తెలంగాణను బంగారు తెలంగాణ చెయ్యడమే లక్ష్యంగా పనిచెయ్యడం మొదలు పెట్టా రు. తెలంగాణలో ముఖ్యంగా సాగు, తాగునీరు, విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నది. ముందుగా వాటిని అధిగమించడానికి పథకాలను రచించారు. ఫలితంగా రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, సీతారామసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులాంటివి పురుడుపోసుకున్నా యి. ఇక మిషన్ కాకతీయ పథకం ద్వారా వేలాది చెరువులు జలసిరులతో కళకళలాడాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. విద్యుదుత్పత్తి, కొనుగోలు సమాంతరంగా సాగించారు. అందుకే గత నాలుగున్నరేండ్లలో ఒక్క క్షణం కూడా కరెంట్ కోత అనే మాట వినిపించలేదు. ఇలాంటి పథకాల అమలుతో తెలంగాణ స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు ఎడారిలా కనిపించిన తెలంగాణ నేడు పచ్చదనంతో మెరిసిపోతున్నది.

అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు తక్షణ ఉపశమనాన్ని అందించే సంక్షేమ పథకాలకు కూడా పెద్దపీట వేసిన మానవతామూర్తి కేసీఆర్. ఆయన మదిలోంచి జీవం పోసుకున్నవే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, కంటివెలుగు లాంటి ప్రజాహిత కార్యక్రమాలు. ఈ పథకాల వల్ల లబ్ధి పొందని కుటుంబాలు తెలంగాణలో లేవనే చెప్పాలి. మొదటి దశలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు వందలకు పైగా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసిందంటే, ఆయన చిత్తశుద్ధి, పేదప్రజల పట్ల మమకారానికి తార్కాణం.
ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రహించడంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సాహసించారు. ముంద స్తు ఎన్నికలు గతంలో కొన్నిసార్లు వికటించాయి. వాజపేయి, చంద్రబాబు ప్రభుత్వాలు తమ మీద వెర్రి నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడ్డాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీఆర్‌ఎస్ పార్టీ వారు కూడా కొందరు భయపడ్డారు. అంతేకాకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇస్తున్నట్లు మూడు నెలల ముందుగానే ప్రకటించి కేసీఆర్ సంచలనం సృష్టించారు. కొందరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు, కానీ.. ఇక్కడ జరుగుతున్నది కేసీఆర్ శీల పరీక్ష. కేసీఆర్ పాలనాదక్షతకు ఫైనల్ పరీక్ష! కేసీఆర్‌కు అగ్నిపరీక్ష!

ఆ విషమ పరీక్షను ఎదుర్కోవడానికి సాహసం కావా లి. ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకాదు, ఎవరితోనూ పొత్తులేకుండా టీఆర్‌ఎస్ ఒం టరిగానే సమరాన్ని ఎదుర్కొంటుందని కేసీఆర్ ప్రకటించటం ఆయనకే సాధ్యమైన విషయం.
కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తమ బద్ధశత్రువైన టీడీపీతో కలిసి మహాకూటమి పేరుతో ఒక భ్రమల కూటమిని నిర్మించిం ది. చంద్రబాబు భజన చేసే పత్రికలు, ఛానెళ్లు కలిసి మహాకూటమి ఘనవిజయం సాధించబోతున్నదంటూ మాయాబజార్ తరహా డ్రామాలకు తెరలేపారు. వీటికితోడు లగడపాటి అనే మరో అబద్ధాల కోరు మహాకూటమి గెలువబోతున్నదని దొంగ సర్వేలతో ఓటర్ల మీద ప్రభావం చూపించడానికి ప్రయత్నించాడు. ఇక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ చేసిన లక్షల కోట్లలో కొన్ని వందల కోట్లు తెలంగాణకు తరలించి మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేశాడు. తెలంగాణలో నివసించే సీమాంధ్రులు మహాకూటమికి ఓట్లు వెయ్యబోతున్నారని ప్రచారం చేశారు. అయినా కేసీఆర్ బాహుబలిలా ఒంటరిగా ఎదుర్కొన్నారు. రోజుకు ఐదారు సభల్లో ప్రసంగించి ప్రజలను జాగృతులను చేశారు. కేసీఆర్ సువర్ణ పాలనను నాలుగున్నరేండ్ల పాటు చవిచూసిన ప్రజలకు మరో ఛాయిస్ అవసరమే లేకుండా పోయింది. కేసీఆర్ శ్రమకు అఖండమైన ఫలితం దక్కింది. అక్షరాలా గతంలో కంటే పాతిక సీట్లు ఎక్కువ ఇచ్చి కేసీఆర్‌ను ఆశీర్వదించారు ఓట ర్లు. ముందస్తు ఎన్నికలు అందరికీ వికటించవని నిరూపించిన ఎదురులే ని మొనగాడు కేసీఆర్. కేసీఆర్ వంటి పాలనాదక్షుడి చేతుల్లో ఉన్నంతవరకు తెలంగాణకు ఎదురులేదు.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

1094
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles