గ్రామాభివృద్ధే లక్ష్యంగా..


Wed,February 13, 2019 11:16 PM

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ప్రతి గ్రామంలో సర్పం చ్ కొలువుదీరాడు. అయితే గ్రామాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కొంతమంది రిసోర్స్‌పర్సన్‌తో కార్యక్రమం నిర్వహించారు. అందులో సర్పంచ్‌లకు శిక్షణ ఎలా ఇవ్వాలో సూచనలు చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ మర్చిపో రని చెప్పారు. సర్పంచ్‌లు ఊరును అభివృద్ధి చేస్తే వచ్చే ఐదేండ్లు కూడా మీరే సర్పంచ్‌గా తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఇస్తారని కూడా చెప్పారు. కేసీఆర్ సలహా, సూచనలను పాటి స్తూ ప్రతి సర్పంచ్ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగాలి. దేశ, రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధితోనే ముడిపడి ఉన్నదనే విష యాన్ని సర్పంచ్‌లు తెలుసుకోవాలి.
- బేగరి ప్రవీణ్‌కుమార్,అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి

విమర్శలతోనే కాలయాపన

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్లమెంట్‌లో ప్రజాసమస్యల ప్రస్తావన లేకుండా కాలయాపన చేశారు. విలువైన సమయాన్ని వృథా చేశారు. రాజ్యాంగ వ్యవస్థ లు మీరు నాశనం చేశారంటే మీ హయాంలోనే అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని ఆరోపణలు గుప్పించుకున్నారు. యూపీఏ పదేం డ్ల పాలనలో జరిగిన కుంభకోణాలు, అవినీతి ప్రచార హస్తాలుగా బీజేపీ గత ఎన్నికల్లో విమర్శలు చేసింది. ప్రజలు కూడా సంకీర్ణ ప్రభుత్వాల వల్ల అస్థిరత నెలకొంటున్నదని భావించి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. కానీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పూర్తిగా విఫలమైంది. నల్లధనం, అవినీతిని అరికడుతామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వం టి చర్యల వల్ల సామన్యులు ఇబ్బందులు పడ్డారు. అంతేగానీ విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్న మోదీ వాగ్దానం ఆచరణలో విఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయింది. నిరుద్యోగ నిర్మూలన కోసం గడిచిన నాలుగున్నరేండ్లుగా చిత్తశు ద్ధిగా ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఇలా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి.
- ఎన్. సతీష్, వరంగల్

291
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles