సముద్రశక్తిగా భారత్


Sat,January 19, 2019 11:14 PM

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో ఎనభై శాతం హిం దూ మహా సము ద్రం మీదుగానే సాగుతుంది. ఈ ప్రాంతంలో ఆర్థిక, రాజకీయ ప్రాధాన్యం కూడా ఈ మధ్య పెరుగుతున్నది. హిందూ మహా సము ద్ర ప్రాంతంలో తమ ప్రమేయం పెరుగుతుందని, భారత్‌తో రక్షణ తదితర రంగాల్లో కలిసి పనిచేస్తామని ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మం త్రి మారైజ్ పైనే ఇటీవల ఢిల్లీలో జరిగిన రైసీనా డైలా గ్ సమావేశంలో మాట్లాడుతూ భారత ఆస్ట్రేలియా భవిష్యత్తు పరస్పరం ముడిపడి ఉన్నది. వచ్చే దశాబా ల్లో రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, అవకాశాలపై సహకరించుకుంటాం అన్నారు. దక్షిణాసియా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆస్ట్రేలియా 25 మిలియన్ డాలర్లు అందిస్తుందని కూడా ఆమె వెల్లడించారు. రెండు దేశాల కార్యకలాపాలను కూడా ఆమె వివరించారు. భవిష్యత్తులో హిందూ మహాసముద్రానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ ప్రసంగం సూచిస్తున్నది. ఆస్ట్రేలియా, భారత్, ఇండొనేషియా, బంగ్లాదేశ్, మడగాస్కర్, సోమాలియా, టాంజాని యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ దేశాలు హిందూ మహా సముద్రాన్ని ఆనుకొ ని ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాల విషయానికి వస్తే, అట్లాంటిక్ సముద్రం మన తాతల కార్యకలాపాలకు వేదిక అయితే, పసిఫిక్ సముద్రం మన తరానికి ప్రాముఖ్యం పొందింది. హిందూ మహా సము ద్రం రాబోయే తరాలకు వేదిక కానున్నది. రాబోయే తరాల భౌగోళిక రాజకీయాలకు హిందూ మహాసము ద్రం వేదిక కాబోతున్నదనే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత దేశాల్లోని ప్రజల సగటు వయ సు ముప్ఫై ఏండ్లు. అమెరికా ప్రజల సగటు వయసు 38 కాగా, జపాన్ సగటు వయసు 46. హిందూ మహాసముద్ర దేశాల్లో మొత్తం జనాభా 250 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో మూడోవంతు.

హిందూ మహాసముద్ర ప్రాధాన్యం పెరుగుతుంద ని చెప్పడానికి అనేక ఆర్థిక, రాజకీయ కారణాలున్నా యి. ఆస్ట్రేలియా కూడా ఈ మహాసముద్రం ఎంతో ప్రాధాన్యం గలది. ఎనభై శాతం చమురు రవాణా ఈ సముద్రం మీదుగానే సాగుతున్నది. ఈ సముద్ర మార్గాలు కొన్ని కీలకమైన జలసంధుల గుండా సాగుతాయి. పర్షియన్ జలసంధికి ఒమన్ జలసంధికి మధ్య హోర్ముజ్ జలసంధి ఉన్నది. పర్షియన్ జలసం ధి నుంచి సాగే రవాణా అంతా ఈ హోర్ముజ్ జలసంధిని దాటవలసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసి యా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కన్ను వేశారు. దీం తో హిందూ మహాసముద్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచ సగటు ఆర్థికాభివృ ద్ధి 3.2 శాతం అయితే భారత్, బంగ్లాదేశ్, మలేషి యా, టాంజానియా దేశాల వృద్ధి 5 శాతం. ఇక భార త్ అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెం దుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. భవిష్యత్తులో అత్యధి క జనాభా గల దేశంగా మారనున్నది. రాజకీయంగా చూస్తే హిందూ మహా సముద్రం వ్యూహాత్మక పోటీకి వేదికవుతున్నది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ పథకం కింద ఈ ప్రాం తంలో ప్రాజెక్టుల కోసం వందల బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నది. కెన్యాకు 470 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు కోసం 3.2 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. గత యాభై ఏండ్లలో కెన్యాలో చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు ఇది. ఈ రైలు మార్గం కెన్యా రాజధాని నైరోబీ నుంచి హిందూ మహాసముద్ర నగరమైన మోంబాసాను కలుపుతుంది. శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్‌లలో కూడా చైనా ప్రభు త్వ తోడ్పాటుగల సంస్థలు పెద్దఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిణామాలకు పాశ్చాత్య దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా మౌలిక వసతుల నిధిని సమకూర్చుతున్నాయి. డిజిటల్ ఎకానమీ, ఇంధనం, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ఇటీవల 113 మిలియన్ డాలర్ల నిధులను అందజేశాయి.
craig-jeffry
భద్రతాపరం గా కూడా హిందూ మహా సముద్రం కీలకమైనది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంత దేశాలకు పలు ఇబ్బందులు తలెత్తాయి. సముద్రపు దొంగలు, నియంత్రణ లేని వలసలు, ఉగ్రవాద కార్యకలాపాలు సోమాలియా, బంగ్లాదేశ్, ఇండొనేషియా తదితర దేశాలకు తలనొప్పిగా మారాయి. ఈ ప్రాంత దేశాలు పరస్పరం సహకరించుకొని ఆర్థికంగా బలపడుతూ, భౌగోళిక రాజకీయ ప్రమాదాలను ఎదుర్కోవాలె. ఈ క్రమంలో ఈ ప్రాం తానికి భారత్ నాయకత్వ పాత్ర పోషించవలసి వస్తుంది. ఈ ప్రాంతంలో పెద్ద దేశం అంటే భారత్ మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ 2008లో షాంగ్రి లా డైలా గ్ వేదికపై చెప్పిన మాటలు గమనార్హమైనవి. ఇండో పసిఫిక్ విస్తృతమైన అవకాశాలకు, సవాళ్లకు వేదికగా మారింది. మన భవిష్యత్తు అంతా పరస్పరం ముడిపడి ఉన్నదని రోజులు గడిచేకొద్దీ నాకు తెలిసివచ్చింది అని మోదీ అన్నారు. గత ప్రధానులతో పోలిస్తే మోదీ అనేక దేశాలు పర్యటించారు. ఆఫ్రికా ఆ కొస నుంచి ఈ కొస వరకు తిరిగారు. భారత్- ఆఫ్రికా దేశాల మధ్య సహకారం పెంచేందుకు, వాణిజ్య పెట్టుబడులు పెంచడానికి కృషిచేశారు. హిందూ మహా సముద్రం చుట్టూరా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోని దేశాలు ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు బంగాళాఖాతం తీరంలోని దేశాలు బిమ్‌స్టిక్ పేర కూటమిగా అవతరించాయి. వీటి మధ్య వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు సాగుతున్నాయి. ఆస్ట్రేలియా మరో 21 దేశాలు కలిసి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ పేర ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆర్థిక అభివృద్ధి, భద్రత అంశాలపై చర్చలు సాగుతున్నాయి. అయితే భారత్ ఇంధనపరం గా సంస్థాగతంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర దేశాల మధ్య తోడ్పాటుతో పోలిస్తే హిందూ మహా సముద్ర దేశాల మధ్య సహకారం ఇంకా తక్కువగానే ఉన్నది.
(ది వైర్ సౌజన్యంతో )

604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles