గ్రామ ప్రశాంతతను కాపాడాలె


Sat,January 19, 2019 01:28 AM

తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచాయి. ఎన్నికల వాతావరణం ఉన్నా, సాధారణ సమయాల్లో నూ గ్రామాల్లో ప్రజలు ఐకమత్యంతో శాంతి ని కాపాడిన చరిత్ర తెలంగాణది. ఇదే సంప్రదాయాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగించాలె. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తిని గెలిపించుకోవాలె. అంతేకానీ రాజకీయాలకు తావిచ్చి ఆధిపత్య పోరుతో కక్షలు, కొట్లాటలకు తావివ్వరాదు. ఎన్నికలు ఓ వారం తర్వాత ముగిసిపోతా యి. ఆ తర్వాత ఏండ్ల తరబడి ఊర్లో కలిసి ఉండాల్సింది ప్రజలే. కాబట్టి ఆధిపత్య రాజకీయాలకు చోటివ్వకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలె.
- బేగరి ప్రవీణ్ కుమార్, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి


ఆర్టీసీకి మనవి

రోడ్డు రవాణా సంస్థ వికలాంగులకు పలురకాల వైకల్యంలో ఉన్న శాతాన్ని బట్టి రాయితీతో బస్‌పాసులు ఇస్తున్నది. కానీ అంధుల కు మాత్రం వంద శాతం అంధత్వం ఉంటేనే బస్ పాస్ రాయితీ ఇస్తామని చెప్పటం సమంజసంగా లేదు. అంధత్వం ఎంత శాతం ఉన్నా అలాంటి వారందరికీ బస్ పాస్‌లో రాయితీ ఇచ్చి సహకరించాల్సిన అవసరం ఉన్నది.
- ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ, వరంగల్

కాలుష్యం పెంచొద్దు

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి శివారు ప్రాంతాలుగా ఉన్న జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటు వేగం పుంజుకున్నది. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్. ప్రతిపాదన ముందుకు వచ్చినప్పటి నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు వెలిసి అభివృద్ధి చెందుతాయి. కానీ అదే సమయంలో పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు మొదటినుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- జంపాల అంజయ్య, సామాజిక కార్యకర్త, భువనగిరి

392
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles