జాతీయస్థాయిలో ఫ్రంట్ ప్రభావం


Fri,January 18, 2019 01:15 AM

జాతీయస్థాయిలో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను నిర్మిస్తామని చాలాకా లం కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు కొందరు ప్రాంతీయ పార్టీల నాయకులతో చర్చలు జరిపారు. ఈ లోపలే తెలంగాణకు ముందస్తు ఎన్నికలు ప్రకటించడంతో ఆ ఎన్నికల హడావుడిలో కొద్దికాలం ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట రాలేదు. కానీ, ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచండ సూర్యతేజంతో ఘనాతిఘన విజయాన్ని సాధించిన తర్వాత మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ కొత్త ఊపిరి పోసుకున్న ది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించి, ఫ్రంట్ కు ప్రాణం పొసే అశ్వమేధ యాగానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఇప్పటికే ఆయన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, జేడీఎస్ లాంటి పార్టీలతో చర్చలు జరిపి వారి మద్దతును కూడగట్టగలిగారు.


ఇక పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత బలమైన పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో కేసీఆర్ తరపున కేటీఆర్ తన బృందంతో కలిసి చర్చలు సాగించారు. కేటీఆర్ బృందానికి ఆత్మీయ స్వాగతం పలికి వైసీపీ నేతలు సుమారు గంటన్నర పాటు కేటీఆర్‌తో మంతనాలు సాగించారు. జాతీయస్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి రావడం శుభపరిణామం గా చెప్పుకోవచ్చు. ఇద్దరూ కలిసి సంయుక్తంగా మీడియా ముందు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం కోసం తాము మద్దతు ఇస్తామని, ఇప్పటికే తమ ఫ్లోర్ లీడర్స్ పార్లమెంట్‌లో ఈ అం శాన్ని లేవనెత్తారని, తమ పార్టీ ఎంపీ కవిత కూడా ప్రత్యేక హోదాపై మద్దతును తెలియజేశారని, త్వరలో తమ పార్టీ అధినేత కేసీఆర్ అమరావతి వెళ్లి జగన్‌తో చర్చలు కొనసాగిస్తారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేయడం రెండు రాష్ర్టాల మధ్య సుహృద్భావపూర్వక సంబంధా లు కొనసాగాలనేది తమ అభిమతమని తేల్చిచెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కు తాము మద్దతిస్తామని జగన్ మోహ న్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఇరువై స్థానాలు గెలుస్తున్నదని ఇప్పటికే సర్వేలు తెలియజేస్తున్నాయి. అలాగే టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలుస్తుందని మొన్నటి శాసనసభ తీర్పుతోనే తేలిపోయింది. ఈ రెండు పార్టీలు ఐకమత్యంతో మెలిగితే సుమారు 37 ఎంపీల బలం చేకూరుతుంది. కేంద్రం నుంచి పలు ప్రయోజనాలను పొందటం సాధ్యమవుతుంది.
Did-KCR
జాతీయస్థాయిలో రాజకీయ పరిస్థితులను గమనించినప్పుడు రాబో యే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని సాధించడం అంత సులభంగా జరిగే పని కాదని ఎవరికైనా అర్థమవుతుంది. మొన్న జరిగి న శాసనసభ ఎన్నికల్లో మూడు ముఖ్యమైన రాష్ర్టాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టి బీజేపీని ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నాయి. ఇక పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలో తృణమూల్ ఫ్రంట్ కనీసం 35 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది. ఢిల్లీలో ఆప్ పార్టీ మళ్లీ విజయ దుందుభి మోగిస్తుంది. బీహార్ లో నితీశ్ కుమార్ కూడా బీజేపీతో అసంతృప్తితోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఈసారి శివసేనకు ఆధిక్యం లభించవచ్చు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. తమిళనాడు, కేరళలో చెప్పాల్సిన అవసరమే లేదు. కర్ణాటకలో నాలుగో, ఐదో బీజేపీ గెలుస్తుందేమో చెప్పలేము. ఇన్ని బలమైన రాష్ర్టాల్లో బీజేపీ వెనుకబడి ఉండగా, ఎన్డీయేకు ఆధిక్యత వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కూడా కొద్దిగా పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దానికి సొంతంగా ఎనభై సీట్లు వచ్చే అవకాశం ఉండొ చ్చు. కాంగ్రెస్‌తో తాజాగా జట్టుకట్టిన టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో బాగా బలహీనపడింది. ఏ విధంగా చూసుకున్నా, ఎన్డీయేకు 200 స్థానాలు, యూపీఏకు వంద స్థానాలు మించవు. కనుక బీజేపీ, కాంగ్రెస్‌లను వ్యతిరేకించే పార్టీలు జట్టుకడితే 200 సీట్లకు పైనే సునాయాసంగా సాధించగలవు. ఫెడరల్ ఫ్రంట్ గనుక రెండు వందలు సీట్లు సాధించిన పక్షంలో ఎన్డీయే, యూపీఏ కూటమిలోని పార్టీలు బయటకు వచ్చి ఫెడరల్ ఫ్రం ట్‌కు మద్దతు ఇచ్చిన పక్షంలో కేంద్రంలో అధికారాన్ని సాధించడం కష్టం కాబోదు. ఈ దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులకు వైసీపీ మద్దతు ప్రకటించడం ముదావహం.తెలంగాణలో ఇరువై లక్షల మందికి పైగా సీమాంధ్రులు సుఖంగా జీవిస్తున్నారు. తాము పరాయి రాష్ట్రంలో ఉన్నామన్న భావనే వారికి కలుగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రాష్ర్టాల మధ్య సఖ్యత, పరస్పర సహకారం ఎంతో అవసరం. నీటి పంపకాలు, కరెంట్ వినియోగం, వస్తు సేవలు, సరఫరాలు మొదలైన రంగాల్లో రెండు రాష్ర్టాలు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ అన్యోన్యంగా ఉండాలి. అలాగే ఇద్ద రూ కలిసి జాతీయస్థాయిలో పోరాడి ప్రయోజనాలు సాధించుకోవాలి. ఈ విజ్ఞత కలిగినవాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆహ్వానానికి తమ అంగీకారాన్ని తెలిపారు.

ఇక వైసీపీ, టీఆర్‌ఎస్ కలిసి పనిచేయాలని ప్రకటించడం పట్ల తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా గంగవెర్రులెత్తిపోతున్నారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యారని, ఆంధ్రా ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని, కేసీఆర్ ఆంధ్రా ద్రోహి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. నిజానికి హరికృష్ణ మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తామని చంద్రబాబు రాయబారాలు పంపిన వైనాన్ని వాటంగా విస్మరిస్తున్నారు. కేసీఆర్ ఛీ కొట్టాక తెలుగుదేశం పార్టీ కి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎవరికి తెలియదు? ఈ విషయాన్నీ చంద్రబాబే స్వయంగా చెప్పిన మాట మరిచారా? అంటే టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే అది రెండు రాష్ర్టాల ప్రయోజనాల కోసం. అదే జగన్ పెట్టుకుంటే ఆంధ్రా కు ద్రోహం చేసినట్లు! ఇదీ తెలుగుదేశం ద్వంద్వ విధానం. చంద్రబాబు వెయ్యినాలుకల మీద మొన్ననే కదా తెలంగాణలోని సీమాంధ్రులు కర్రు కాల్చి వాతలు పెట్టారు! ఎక్కడా డిపాజిట్లు రాకుండా తరిమికొట్టారు!. చంద్రబాబు కారు కూతలను విశ్వసించే స్థితిలో ఆంధ్రులు ఏ మాత్రం లేరనే విషయం మొన్నటి ఎన్నికల్లోనే స్పష్టమైపోయింది.
Muralimohan
వాస్తవానికి టీఆర్‌ఎస్, వైసీపీ ఎన్నికల పొత్తులు పెట్టుకోలేదు. ఆంధ్రా లో టీఆర్‌ఎస్ పోటీ చెయ్యదు, తెలంగాణలో వైసీపీ పోటీ చెయ్యదు. అలాంటపుడు పొత్తులు అని ఎలా ఆరోపిస్తారు? యూపీఏ ఫ్రంట్‌లో చంద్రబాబు చేరినట్లే ఫెడరల్ ఫ్రంట్‌లో వైసీపీ చేరుతుంది. అందులో దోషం ఏముంది? కాకపొతే, చంద్రబాబుకు అనుకూల మీడియా అం డగా ఉన్నది. అందువల్ల యజమాని ఆదేశాలమేరకు వైసీపీ, టీఆర్‌ఎస్ మీద కావలసినంత బురద చల్లుతుంది. కానీ పచ్చ మీడియాను గుడ్డిగా విశ్వసించే స్థితిలో ప్రజలు లేరు. బలమైన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు అందుతున్నాయి. ఎవరేమిటి అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతారు. ఎవరేమనుకున్నప్పటికీ, ఫెడరల్ ఫ్రం ట్ ద్వారా జాతీయస్థాయిలో టీఆర్‌ఎస్, వైసీపీ ప్రముఖ పాత్రను పోషి స్తాయనేది మాత్రం సత్యం. అది మరో నాలుగు నెలల్లో రుజువు కాబోతున్నది.
(వ్యాసకర్త: సీనియర్ రాజకీయ విశ్లేషకులు)

2336
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles