నిర్మాణాత్మకంగా వ్యవహరించాలె


Fri,January 18, 2019 01:13 AM

ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరుగాలి. ఇందుకు అధికార, ప్రతిపక్షాలు కలిసి సమగ్రంగా చర్చించాలి. గతంలో లాగా ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. రాష్ర్టాభివృద్ధి కోసం అధికార పార్టీ ఏం చేయాలో తగిన సలహాలు అందించాలి. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి. అప్పుడే ప్రజల మన్ననలు పొందగలుగుతారు. అంతేగానీ ప్రతిప క్షం కనుక కేవలం విమర్శలే చేస్తామనే విధంగా వ్యవహరించకూడదు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రతిపక్షాలు రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. వారి ఆక్షాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో తన వంతు పాత్ర పోషించాలి.
- నోముల ప్రవీణ్‌కుమార్, నల్గొండ


ప్రయాణ భారాలు తగ్గించాలె

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ సాధించే లక్ష్యంతో పనిచేస్తున్న ది. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. రాబో యే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుంది. ఎందుకంటే ఏ చిన్న అనారో గ్య సమస్య తలెత్తినా ప్రజలు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించాల్సి వస్తున్నది. అక్కడ వారు వేసే బిల్లుల గురించి చెప్పనక్కరలేదు. కాబ ట్టి ఈ పరీక్షలు పేద, మధ్య తరగతి ప్రజలకు చాలా మేలు చేస్తాయి. కంటివెలుగు ద్వారా అద్దాలు అవసరమున్న వారికి ప్రభుత్వమే రూపాయి ఖర్చులేకుండా అందజేసింది. త్వరలో చేయబోయే పరీక్ష ల ద్వారా ఆయా రంగాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పరీక్ష లు చేస్తారు. కాబట్టి ఏవైనా చిన్న సమస్యలుంటే అక్కడే చికిత్సతో పాటు అవసరమైన మందులు కూడా ఇస్తారు. దీంతోపాటు పెద్ద సమస్యలు ఉంటే సమీపంలోని పెద్ద దవాఖానకు తీసుకెళ్లనున్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమాలు అభినందనీయం.
- అక్షరకుమార్, హైదరాబాద్

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles