యూఎస్ఏ మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలో నిర్మించనున్న ఈ భవనం పేరు ‘వన్ హండ్రెడ్’. ప్రఖ్యాత స్టూడియో గ్యాంగ్ దీనికి డిజైన్‌ను అందించింది. ఒకవైపు గేట్‌వే ఆర్చ్, మరోవైపు ఫారెస్ట్ పార్క్ కనిపించేలా, 380 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో నివాస గృహాలతోపాటు వాణిజ్య కేంద్రాలనూ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఉండే ప్రతి ఫ్లాట్‌కూ సొంతంగా టెర్రస్ వచ్చేలా భవనానికి రూపకల్పన చేశారు. అన్ని గదుల్లోనూ సూర్యకాంతిని సమర్థంగా ఉపయోగించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం త్రికోణపు ఆకుల ఆకారంలోని అద్దాలను బిగించనున్నారు. ప్రకృతిని ఆస్వాదించేవారితోపాటు పర్యావరణ ప్రేమికులకు ఈ భవనం స్వర్గధామం కానున్నదని దీనికి డిజైనింగ్ చేసిన స్టూడియో గ్యాంగ్ ప్రతినిధులు చెబుతున్నారు.