e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిల్లాలు Hyderabad | వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తాం : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

Hyderabad | వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తాం : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం : కాప్రాయి చెరువు వరదకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరద మల్లింపు పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. గుర్రంగూడ అటవీ ప్రాంతంలో పర్యటించి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్మాస్ గైడ్‌ ప్రాంతం నుంచి వచ్చే వరదను కాప్రాయి చెరువులోకి రాకుండా గుర్రంగూడ అటవీ ప్రాంతం గుండా శివారుకు తరలించేలా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రూ.72.10లక్షలతో పనులు జరుగుతున్నాయన్నారు.

గాయత్రినగర్‌ ఫేజ్‌3 నుంచి రాచకాల్వకు కలిపి అక్కడినుంచి పెద్ద అంబర్‌పేట్‌ చెరువుకు వరద వెళ్తుందని తెలిపారు. కాగా స్థానికులు పలు అనుమానాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారికి నివృత్తి చేశారు. కాప్రాయి చెరువు కింది కాలనీల ప్రజలు ఆంధోళన చెందవద్దని, శాశ్వత పరిష్కారం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement