TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Warangal News
7/27/2016 1:21:37 AM
కళలకు సజీవ తార్కాణం ఓరుగల్లు..
-ఉద్యమంలో కవుల పాత్ర మరువలేనిది..
-తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ
నయీంనగర్, జూలై 26 : కళలకు సజీవతార్కాణంగా ఓరుగల్లు నిలుస్తుందని తెలంగాణరాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామి డి హరికృష్ణ అన్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషాశాఖ, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో 442 కవుల కవితా సంకలనాలతో రూపొందించిన తొలిపొద్దు పుస్తక ఆవిష్కరణ పొట్లపల్లి శ్రీనువాస్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం హన్మకొండలోని అశోకా హోటల్‌లో నిర్వహించారు. ప్రముఖ కవి, రచయిత కోవెల సుప్రసన్నాచార్యుల పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులపాత్ర మరువలేనిదన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి సాహిత్య ప్రియుడు కనుక రవీంద్రభారతిలో ప్రభుత్వ అధికారుల మధ్యలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. తొలిపొద్దుకు కవులంతా కిరణాలని కొనియాడారు. వేదిక మీద ఉన్న ప్రతిఒక్కరూ తనకు స్ఫూర్తి అని, వారి ఆశీస్సులతోనే ఇంతటివాన్ని అయ్యానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత అంపశ య్య నవీన్, కవులు వీఆర్ విద్యార్థి, అనిశెట్టి రజిత, గిరిజామనోహర్‌బాబు, రామచంద్రమౌళి, బన్నా అయిలయ్య, రమాదేవి, తెలంగా ణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
285
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd