e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు ఆలుగడ్డ అంటే అనంతగిరి గుర్తుకురావాలి

ఆలుగడ్డ అంటే అనంతగిరి గుర్తుకురావాలి

ఆలుగడ్డ అంటే అనంతగిరి గుర్తుకురావాలి

రైతుల ఆర్థిక అభివృద్ధి కోసమే రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు
పొలాల వద్దే గ్రేడింగ్‌ చేయాలి
పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా
మోమిన్‌పేట మార్చి 16: రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసుతో కలిసి సంస్థ పనితీరును పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మంచి లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సంస్థ ప్రభుత్వ సంస్థ కాదని ఇది రైతుల సంస్థ అని దీని అభివృద్ధి కోసం కొంత కాలం పాటు ప్రభుత్వ సహకారం ఉం టుందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సూచనలు చేశారు. ఇక ముందు రైతులు పండించిన కూరగా యల పంటలను వారి పొలాల వద్దనే గ్రేడింగ్‌ చేసి తీసుకురావాలని తెలిపారు. కూరగాయలను మార్కెట్‌కు తరలించేందుకు ఈ-వాహనాలు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకోకుండా వారు లాభపడే విధంగా సంస్థలో రైతు కుటుంబాలు పనిచేస్తే బాగుంటుందని సూచించారు. సంస్థ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని సఫల్‌ కంపెనీకి తీసుకెళ్లి పనిలో నైపుణ్యం కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. సంస్థకు అవసరమైన ట్రాలీ వాహనాలు,ప్లాస్టిక్‌ ట్రేలు సమాకుర్చుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సంస్థ నిర్వహణ బాగుందని, ఇంకా మెరుగు పర్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పదివేల ఎఫ్‌పీవో కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించిందని ప్రతి ఎఫ్‌పీవో కు 25 లక్షల గ్రాంట్‌ ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.అనంతరం ఆలుగడ్డ గ్రేడింగ్‌ విధా నాన్ని పరిశీలించారు. ఈ సంస్థ నుంచి నాణ్యత ఆలుగడ్డను అందించి అలుగడ్డ అంటే అనంతగిరి గుర్తుండిపోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌ సెర్ఫ్‌ సీఈవో రజిత, జడ్పీ సీఈవో ఉషా, హెచ్‌వో అబ్దుల్‌ గఫార్‌, డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం శివ, ఏఈ ప్రణీత్‌, ఎంపీడీవో శైలజా రెడి,్డ ఎంపీవో యాదగిరి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆలుగడ్డ అంటే అనంతగిరి గుర్తుకురావాలి

ట్రెండింగ్‌

Advertisement