హయత్‌నగర్ : కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల దొంగతనాలను అరికట్టవచ్చని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి కాలనీవాసులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. నిఘా నేత్రాలతో నేరాలను నియంత్రించవచ్చునని పేర్కొన్నారు. కాలనీలో అతి త్వరలో డ్రైనేజీ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, నాయకులు భాస్కర్ సాగర్, మల్లీశ్వరి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రొయ్య భాస్కర్, శ్రీనివాస్, నెహ్రూ, స్వామి, సత్యనారాయణ, యాదగిరి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.