శంషాబాద్ :జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జామ్‌నగర్‌కు స్టార్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. టైర్-2, టైర్-3 నగర ప్రయాణీకులకు ఎయిర్కనెక్టివిటి అందించడం ద్వార ప్రాంతీయ కనక్టివిటిని బలోపేతం చేయడానికి ఉద్ధేశించిన ఉడాన్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించినట్లు మంగళవారం జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గ్గాలు అధికార ప్రకటనలో తెలిపారు.
జామ్‌నగర్‌కు స్టార్ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాలు నడుపనున్నారు. జ్యువెల్ ఆఫ్ కథియవర్ గా జామ్‌నగర్ ప్రసిద్ది. స్టార్ ఎయిర్‌లైన్స్ ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ సంజయ్ ఘోడావత్ కు చెందిన విమానయాన భాగం. ఆగ్రో, ఏవియేషన్, మైనింగ్, రియాల్టి, ఎనర్జీ, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, టెక్స్టైల్ రంగాలలో ఉనికిని కలిగి ఉంది. దేశమంతటికి ఆన్లైన్ షెడ్యూల్ సేవలు అందిస్తున్న ఎయిర్‌లైన్ సంస్థ.