e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home జిల్లాలు పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కడ్తాల్‌ మార్చి 18 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్‌లో తాసిల్దార్‌ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 57 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల పెండ్లికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
భవన నిర్మాణాలు చేపడుతాం..
మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలను చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, సర్పంచులు కృష్ణయ్యయాదవ్‌, రవీందర్‌, భారతమ్మ, ఎంపీటీసీలు గోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ జైపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, నాయకులు విఠలయ్యగౌడ్‌, బాలకృష్ణ, కస్ననాయక్‌, శ్రీశైలంయాదవ్‌, బీచ్యానాయక్‌, సాయిలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
కడ్తాల్‌, మార్చి 18 : విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్‌ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ‘రౌండ్‌ టేబుల్‌ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మించిన ఐదు అదనపు గదులను, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, సంస్థ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ విద్యకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముద్విన్‌ గ్రామంలోని బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ యాదయ్య, ఎంపీటీసీ నిర్మలాదేవి, ఏంఈవో సర్దార్‌నాయక్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ వీరయ్య, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పీయూష్‌ షా, సందేశ్‌ ఆశిష్‌, జితేందర్‌సింగ్‌, చేతన్‌దేవ్‌సింగ్‌, కిస్తిజ్‌, పూజాబహ్న, రిటైర్డ్‌ ఏంఈవో రామేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement