MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nizamabad News
8/18/2016 2:01:37 AM
రక్షా బంధం
ఆర్మూర్/నమస్తే తెలంగాణ:సోదరీసోదరుల అనురాగం, ఆప్యాయత, అనుబంధాల ప్రతీక రక్షాబంధన్. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువుగా గుర్తుచెప్పే చిన్న దారానికే వన్నెలా కరిగిపోయే అన్నదమ్ముల ఆప్యాయతను కలబోసుకున్న అపురూపమైన పండుగ రాఖీ పౌర్ణమి. నాకు నీవు రక్షా.. నీకు నేను రక్షా ...మనమంతా దేశానికి రక్షా అంటూ దేశ నిరతిని కలిగి ఉన్న అద్వితీయమైన పండుగ రక్షా బంధ నం. ఈ రక్షా బంధనాన్ని రాఖీ పౌర్ణమిగా, శ్రావ ణ పౌర్ణమిగా, జంద్యాల (జంజ్రాల) పండుగగా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. తన సోదరుడు సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని కోరుకుంటూ సోదరి కట్టే ఈ రాఖీకి ప్రాచీన గాథ ఉంది.

ప్రాచీనగాథలో ఏనబద్దో బలిరాజ ధానవేంద్రో మహాబలహ తేనత్వ మబిబద్నామి రక్షే మాచల మాచల అనే శ్లోకాన్ని పటిస్తూ రక్షాబంధనాన్ని చేపట్టేవారు. దీని అర్థం ఇది. మహా బలవంతుడు, రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని బంధించిన ఓ రక్షాబంధమా.. నేను నిన్ను ధరిస్తున్నాను.. నీవు చలించక రక్షణ కల్పించుము అని మంత్రం అర్థం. బలి చక్రవర్తి కోరిక మేరకు మహావిష్ణువు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మీ వెళ్లి బలి చక్రవర్తికి రాఖీ కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకెళ్లిపోతుంది. అందుకే హిందూ పురాణాల్లో రక్షాబంధానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది.

రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే...
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధ్దంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌లో రక్షా బంధనం
కాలం మారడంతో పాటు రక్షాబంధనం తీరు మారింది. విద్య, ఉపా ధి, ఇతరత్ర కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపుతుండడం నేటికీ సంప్రదాయం గా కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్‌లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్‌లైన్ ద్వారా నే కానుకలు స్వీకరించే విధానం ప్రస్తు తం కనిపిస్తోంది. స్కైపుల్లో, వాట్సాప్ లాంటి సోషల్ మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకోవడం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి వెసులుబాటుగా మారింది. పద్ధతులు మారినా రాఖీలో అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కుచెదరలేదు

రాఖీ పండుగ పవిత్రత ఏమిటంటే..
భార్య భర్తకు, సోదరి సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని, సుఖసంతోషాలు, సంపదలు కలగాలని ఆకాంక్షించే చక్కని సంప్రదాయం రాఖీ పండుగ విశిష్టత. రాఖీలు కట్టించకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్ర్తాలు, కానుకలు సమర్పిస్తారు. అందరూ కలిసి ఆత్మీయంగా భోజనాలు చేస్తారు. పూర్వకాలంలో విదేశీయులు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో వారి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. స్త్రీలు మాన, ప్రాణ రక్షణకు వీరులైన యోధులను గుర్తించి రక్షాబంధనం కట్టేవారు. సోదరభావంతో యోధులు వారికి రక్షణ కల్పించేవారు. రాణి కర్ణావతి దుర్గాన్ని ఒకసారి శత్రువులు ముట్టడించినప్పుడు, ఆమె ఢిల్లీ బాదుషాకు రాఖీ పంపింది. దీనికి బాదుషా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆమె ఇంట్లో భోజనం చేసి కానుకలు సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది.
1013
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd