MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nizamabad News
10/30/2015 12:49:41 AM
ఫణిహారం రంగాచారి వర్ధంతి
కామారెడ్డి, నమస్తేతెలంగాణ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఫణిహారం రంగాచారి 66వ వర్ధంతి గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని సాందీపని జూనియర్ కళాశాలలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్ మాట్లాడారు. నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఏఐఎస్‌ఎఫ్ అనుబంధంగా హెచ్‌ఎస్‌యూ నాయకులు మోహినొద్దీన్, నారాయణరెడ్డి, రాజ్‌బహుదూర్, కె.ఎల్. మహేంద్రలతో సంస్థ బంధాలను ఏర్పర్చుకొని రంగాచారి దళాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిచే వారని గుర్తు చేశారు. 1947లో హెచ్‌ఎస్‌యూ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో వందలాది మంది విద్యార్థులను సమీకరించి జాతీయజెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటారన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను, జయంతి, వర్ధంతిలను, వారి చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఉన్న పశు వైద్య విశ్వవిద్యాలయానికి, డిగ్రీ కళాశాలకు రంగాచారి విశ్వ విద్యాలయంగా మార్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి బాల్‌రాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దశరథ్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సుధీర్, అరుణ్, పృథ్వీరాజ్, ముదాం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో..
కామారెడ్డి పట్టణానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఫణిహారం రంగాచారి 66వ వర్ధంతిని అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జేఏసీ నాయకులు జగన్నాథం, వి.ఎల్. నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తిర్మల్‌రెడ్డి, లెక్చరర్ల సంఘం నాయకుడు శ్యామ్, సీపీఎం నాయకుడు చంద్రశేఖర్, న్యూడెమెక్రసీ నాయకుడు కట్ల భూమన్న, పీడీఎస్‌యూ నాయకుడు ఆజాద్, ఏఐఎస్‌ఎప్ నాయకుడు భానుప్రసాద్, అరుణ్, సుధీర్, న్యాయవాదులు వెంకట్‌రాంరెడ్డి, చింతల గోపి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
179
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd