THURSDAY,    December 13, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nizamabad News
3/7/2017 1:43:12 AM
పాయల్ ఝంకార్..!
డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా 20 ఏళ్లుగా వాయిద్య సంగీతంలో రాణిస్తున్న సల్లా పాయల్‌కు ఈ అవార్డు వరించింది. మహిళా దినోత్సవం రోజున పాయల్‌కు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. నిజామాబాద్‌లోని సంగీత నృత్య కళాశాలలో తబలా రంగంలో డిప్లొమా పూర్తి చేశారు. రాజకీయ రంగంలోనూ పాయల్ ముందున్నారు. బర్దీపూర్ ఎంపీటీసీగా గెలుపొందారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ధృడసంకల్పంతో తబలా నేర్చుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులను అందుకుంది. 8న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అందుకోనున్నారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ అవార్డుకు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తమ కుటుంబమంతా సంగీతానికి అంకితమైందన్నారు. గురువు కృష్ణ ఆశీర్వాదంతో ఎన్నోఅవార్డులను అందుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు 2005 జాతీయ స్థాయి, 2004, 2007లో రాష్టస్ధాయి అవార్డులు అందుకున్నానని బెంగళూర్‌లో హార్ట్ ఆఫ్ లివింగ్‌లో గురువు రవిశంకర్‌జీ నిర్వహించిన సంగీత కచేరిలో తబాలా వాయించి అందరి మన్ననలు పొందానన్నారు.
310
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd