WEDNESDAY,    December 12, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nizamabad News
8/23/2016 2:45:45 AM
నిత్య చైతన్య శక్తి.. తెలంగాణ కవిత్వం
వినాయక్‌నగర్ : తెలంగాణ కవిత్వం చైతన్య శక్తిగా ప్రకాశిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. సోమవారం కేర్ డిగ్రీ కళాశాలలో ని ర్వహించిన తొలిపొద్దు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు వందల నలభై రెండు మంది కవులు సూర్యులై సృష్టించిన కవిత సంకలనం తొలిపొద్దు అని కొనియాడారు. కొరవి గోపరాజు నుంచి శ్రీధర్‌రావు, సేనాపతి భాష్యకాచార్యులంటి లబ్ధ్దిప్రతిష్టులైన కవుల వారసత్వం ఇం దూరు కవులు అంది పుచ్చుకున్నారని అన్నారు. నేటి సంస్కృతిని ప్రపంచంలోనే అన్ని తరాల వారికి అందించేలా నిరంతరం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, హరిదా రచయితల సంఘం జి ల్లా అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ , తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్, పుస్తకాన్ని రచించిన డాక్టర్ వీ.శంకర్, శ్రీనివాస్, నరేశ్, మాధవీలత, అనసూయ, స్వామిరాజ్, రమణాచార్య, శ్రీమన్నారాయణ చార్య, గుప్తా ప్రసాద్, నరహరి పాల్గొన్నారు.
545
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd