THURSDAY,    December 13, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nalgonda News
5/21/2016 12:28:05 AM
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు
- ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి
-విలేకరుల సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి
నీలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకలను జూన్2న ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేసిన 25మందికి సన్మానంతోపాటు రూ.51వేల నగదు పురస్కారం అందిస్తామన్నారు. రైతు, ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్, ప్రభుత్వ ఉద్యోగి, సామాజిక కార్యకర్త, డాక్టర్, క్రీడాకారుడు, కళాకారుడు, వేద పండితుడు, జర్నలిస్ట్, న్యాయవాది, మండలం, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ తదితర విభాగాల్లో పురస్కారం అందజేస్తామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పరేడ్ గ్రౌండ్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అనంతరం శకటాల ప్రదర్శన, ఆస్తుల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం, సాయంత్రం 6.30గంటల నుంచి 10:30 వరకు ఎన్జీ కళాశాల మైదానంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేసి.. విద్యుత్ దీపాలతో ఆలంకరించాలని సూచించారు. వృద్ధాశ్రమాల్లో వస్ర్తాలు, మిఠాయిలు, అంధ విద్యార్థులకు వస్ర్తాలు, వారికి ఉపయోగపడే పరికరాలు అందజేయాలని మండల, డివిజన్, జిల్లాస్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయాలని సూచించారు.

ఇంకుడు గుంత నిర్మించుకోవాలి..
వేసవిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడి నుంచి బయటపడగలిగామని ముందస్తు ప్రణాళికతో మంచినీటి సమస్య లేకుండా చూశామని అన్నారు. భూగర్భ జలాలు ఎన్నడూ లేనంతగా 32మీటర్ల లోతుకు పోయాయన్నారు. మరో 15 రోజులు నీటి సమస్యను అదిగమిస్తే.. రుతు పవనాలు వచ్చి వర్షాలు కురుస్తాయని.. వర్షపు నీరు భూమిలో ఇంకేలా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అన్నారు. గ్రామంలో పీల్డ్ అసిస్టెంట్‌ను కలిసి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావ్, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
183
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd