TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Nalgonda News
1/9/2016 2:13:24 AM
ఉద్యమ చరిత్రలో ఆలేరు పాత్ర మరువలేనిది : యాదగిరి

ఆలేరు రూరల్ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆలేరు ప్రజల పాత్ర మరువలేనిదని హైదరాబాద్ జిందాబాద్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. స్థానిక రహదారి బంగ్లాలో ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎర్ర జాన్సన్‌మాదిగను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, తెలంగాణ ఐక్యవేదిక వ్యవస్థాపకుడు వీరమల్ల ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్ర అవిర్భావం అనే పుస్తకంలో ఆలేరు ఆణిముత్యం జాన్సన్ పేరును ప్రస్తావించడం ఆలేరుకే గర్వకారనమన్నారు. త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందని,

సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాలన్నారు. ప్రేమ సేవా సదనం డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్‌పాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎస్టీఓ ఆముదాల చిత్తరంజన్, వైస్‌ఎంపీపీ కొరుకొప్పుల కిష్టయ్య, ఆలేరు జేఏసీ కన్వీనర్ సుంకరి సత్యనారాయణ, ఆయా పార్టీల నాయకులు ఆకవరం మోహన్‌రావు, జంపాల శ్రీనివాస్, మొరిగాడి శ్రీశైలం, చెక్క వెంకటేశ్, జూకంటి పౌల్, కందుల రామన్, సీనియర్ జర్నలిస్ట్‌లు యంబ నర్సింహులు, తోట మల్లయ్య, విజయభాస్కర్‌రెడ్డి, కిశోర్, మహేందర్, గిరికుమార్, మహమ్మద్ బాబు, మల్లేష్, మోహన్, దేవేందర్, రాజయ్య పాల్గొన్నారు.
513
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd