e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News అదిరిపోయే డిజైన్లు.. డిఫ‌రెంట్ టేస్ట్‌ల‌తో టీస్టాళ్లు.. ఇప్పుడు గ్రామాల్లో కూడా..

అదిరిపోయే డిజైన్లు.. డిఫ‌రెంట్ టేస్ట్‌ల‌తో టీస్టాళ్లు.. ఇప్పుడు గ్రామాల్లో కూడా..

Tea | మనలో అధిక శాతం మంది రోజు వారీ దినచర్యను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొందరికైతే టీ తాగనిదే ఏ పనీ చేయబుద్ధి కాదు. టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. చాయ్‌ ప్రియుల ఇష్టాలకు అనుగుణంగా రకరకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. నగరాల్లో మాత్రమే లభించే రకరకాల టీలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ వచ్చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలతోపాటు రహదారుల వెంట వెలుస్తున్న టీస్టాళ్లు సరికొత్త డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి.

Tea

భిన్న రుచుల్లో..

చాయ్‌లో ధమ్‌ టీ, బ్లాక్‌ టీ, జింజర్‌ టీ, మసాల టీ, కశ్మీరీ చాయ్‌, లెమన్‌ టీ, గ్రీన్‌ టీ, జింజర్‌ లెమన్‌ టీతోపాటు వివిధ ఫ్లేవర్లలో కాపీలు ఉంటాయి. చల్లగా ఉండే మిల్క్‌షేక్స్‌ వెనిల్లా, చాకొలేట్‌, స్ట్రాబెర్రీతోపాటు భిన్న రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కూలర్స్‌, మొజిటో, లస్సీ, కోల్డ్‌ కాఫీతోపాటు స్నాక్స్‌ దొరుకుతున్నాయి. ప్రశాంతంగా కూర్చుని వినియోగదారులు రకరకాల రుచులను ఆస్వాదిస్తున్నారు.

వివిధ పేర్లతో..

- Advertisement -

టీ షాపులు ప్రస్తుతం కొత్తకొత్త పేర్లతో మార్కెట్లో కనిపిస్తున్నాయి. టీం టైం, టీ హౌస్‌, మిస్టర్‌ టీ, ఆన్‌ టీ వంటి పేర్లతో వెలుస్తున్నాయి. ఇందులో రకరకాల టీలతోపాటు మిల్క్‌ షేక్‌లు, ప్లేవర్డ్‌ మిల్క్‌లను విక్రయిస్తున్నారు.

Tea stal

రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు

వివిధ కంపెనీల నుంచి ప్రాంచైజీ తీసుకొని ఈ టీ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జనం రద్దీతోపాటు హైవేల వెంట ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 150 నుంచి 200 చదరపు అడుగుల స్థలం తీసుకొని ముందు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారులకు నచ్చే విధంగా స్టాళ్లను తీర్చిదిద్ది వెరైటీ చాయ్‌లను అందిస్తున్నారు.

పెరిగిన పోటీ…

జనాదరణ ఉండడంతో ఇలాంటి టీ షాపులు ఏర్పాటు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భువనగిరి, చౌటుప్పల్‌, యాదగిరి గుట్ట, నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌ పట్టణాల్లో ఇవి ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100 వరకు ఈ షాపులు ఉన్నాయి.

జనాల నుంచి ఆదరణ వస్తుంది

మేం ఏర్పాటు చేసిన టీ దుకాణానికి జనాల నుంచి మంచి ఆదరణ వస్తున్నది. యువత ఎక్కువగా పలు రకాల వెరైటీలు తాగుతున్నారు. కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి సౌకర్యంగా ఉండడంతో ఎక్కువగా వస్తున్నారు.

-అంబటి నగేశ్‌, టీ షాప్‌ నిర్వాహకుడు, కొండమడుగు మెట్టు, యాదగిరిగుట్ట

చాయ్‌లు చాలా బాగున్నాయి..

కొత్త టీ షాపుల్లో రకరకాల చాయ్‌లు దొరుకుతున్నయ్‌. రుచికరంగా ఉంటున్నాయి. మా ఫ్రెండ్స్‌తో రోజూ వచ్చి ఇక్కడ చాయ్‌ తాగుతాం.

– గోపగాని ప్రసాద్‌, మల్లాపురం, యాదగిరిగుట్ట

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?

ఈ టీ తాగితే బ‌రువు తగ్గొచ్చు

Coffee | అతిగా కాఫీ తాగితే మ‌తిమ‌రుపు వ‌స్తుందా?

బ్లాక్‌ కాఫీ.. గుండెకు మంచిదేనా?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement