అడవుల్లో నీటి కుంటలు
సోలార్ ప్యానల్స్‌తో మోటర్లు
బోర్లు వేసి కుంటల్లోకి నీటి తరలింపు
అక్కడే వ్యూ పాయింట్‌పై ప్రకృతి దృశ్యాలు తిలకించే ఏర్పాట్లు
ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ
ఏటూరుగారం,ఏప్రిల్ 2: వేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు అడవుల్లో నీటి కుంటలు నిర్మిస్తున్నారు. సోలార్ ప్యానల్స్‌తో మోటర్లు నడిపి బోర్లు వేయిస్తున్నారు. అనంతరం కుంటల్లో నీటిని నింపుతున్నారు. దానికి చేరువలో వ్యూ పాయింట్ (మంచె) నుంచి ప్రకృతి దృశ్యాలను తిలకించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంటలు భూగర్భ జలాలను పెంచడంతో పాటు జీవాల దాహం తీరుస్తున్నాయి.
గతంలో అడవిలో ప్రత్యేకంగా సాసర్ పిట్స్ ఏర్పాటుచేసి అందులో నీటిని పోయడం, ఉప్పుగళ్లు చెట్లకు కట్టి వన్యప్రాణుల దాహం తీర్చేవారు. ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో సోలార్ మోటర్లను ఏర్పాటు చేసి బోర్లు వేస్తున్నారు. అక్కడినుంచి నీటి కుంటలకు వరద చేరుతుంది. ఇవి అనేక వన్యప్రాణుల దాహం తీర్చుతున్నాయి. నీటి కుంటలు, సోలార్ ప్యానల్స్, మోటర్ల కోసం అటవీశాఖ రూ.3.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించింది. దీంతో సోలార్ పంపుసెట్లు నిత్యం నడుస్తున్నాయి. నీటి నిల్వలు కుంటల్లో ఎక్కువగా ఉండేందుకు మట్టితో చుట్టూ చెరువు కట్టల తరహాలో నిర్మించారు. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో వ్యూ పాయింట్‌తో పాటు మరో మూడు చోట్ల వీటిని ఏర్పాటుచేశారు. సోలార్ ప్యానెల్స్‌కు రక్షణగా చుట్టూ ఫె న్సింగ్ వేశారు. బోరు నీటితోనే కాకుండా వర్షాలు కురిస్తే కుంటలోకి నీరు చేరేలా అ నువైన ప్రదేశాలను అధికారులు గుర్తించి నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల నీటి కుంటలు నిర్మించగా, మరి కొన్నిచోట్ల అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్‌డ్యాంలకు అనుసంధానం చేశారు. దీంతో అక్కడ నీటి నిల్వలు ఉంటున్నాయి.
కనువిందు చేస్తున్న కుంటలు
దట్టమైన అడవుల మధ్య నిర్మించిన నీటి కుంటలు కనువిందు చేస్తున్నాయి. కట్టలు కూడా నిర్మించడంతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. చిన్నబోయినపల్లి సమీపంలో ఉన్న నీటి కుంటకు చేరువలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. దీనిపై నుంచి అడవిలోని అందమైన దృశ్యాలను తిలకించే వీలు కల్పించారు. నీటి కుంటల వరకు అటవీ అధికారులు తాత్కాలిక రోడ్లను కూడా వేశారు. దీంతో వాహనాలు అక్కడివరకు వె ళ్తున్నాయి. అడవిలోని ఈ నీటి కుంటలు జీవాల దాహం తీర్చడమే గాక పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చూడండి..
ఇండియన్ రైల్వేస్ కొత్త రికార్డు
ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి వసూళ్ల ముఠా నడిపిన సచిన్ వాజే