TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Mahboobnagar News
2/10/2017 1:34:36 AM
స్వాతంత్య్ర సమరయోధుడు రోషనప్ప కన్ను మూత
ఊట్కూరు : మండల కేంద్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు టప్ప రోషనప్ప (92) బుధవారం అర్ధరాత్రి కన్ను మూశారు. గత మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురైన రోషనప్పను కుటుంబ సభ్యులు చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ దవాఖానాలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన తుది స్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతిక ఖాయాన్ని ప్రత్యేక అంబులెన్స్ సహాయంతో స్వగ్రామానికి తీసుకువచ్చారు.

తొమ్మిది పదులు దాటిన ఆయన మరణ వార్తతో జిల్లా ప్రజలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. స్వాతంత్య్ర సమరయోధులు, బంధువులు, అభిమానులు జ్ఞాపకాలను తలుచుకుని కన్నీటి పర్యంత మయ్యారు. స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆయనకు భార్య శంకరమ్మతో పాటు ఇద్దరు కుమారులు, రమేష్, వివేక్, నలుగురు కుమార్తెలు ఇందిరమ్మ, సుభద్రమ్మ, జయమ్మ, లక్ష్మి ఉన్నారు. గురువారం స్వగ్రామంలో జరిగినఅంత్యక్రియలకు తహసీల్దార్ నాగన్న హాజరై అధికార లాంఛనాలతో బౌతిక ఖాయంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. మృతికి సంతాపకంగా గ్రామస్తులు విద్యా సంస్థలు, వ్యాపార కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి రోషనప్ప మృతిచెందిన విషయాన్ని స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల ద్వారా తెలుసుకుని విచరం వ్యక్తం చేస్తుకుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వివిధ పార్టీల నాయకులు, సీనియర్ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాష, జడ్పీటీసీ సభ్యులు సూర్యప్రకాష్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పీఏసీఎస్ చైర్మన్ ఎల్కోటి నారాయణరెడ్డి, సర్పంచులు భాస్కర్, విజయభాస్కర్‌రెడ్డి, రాజుల ఆశిరెడ్డి, కొండయ్య, నింగిరెడ్డి, బాల్‌రెడ్డి, లక్ష్మన్న, నర్సింహులుతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్యసమాజ్ సభ్యులు అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.
455
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd