e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు ‘పల్లె’వించిన ప్రగతి

‘పల్లె’వించిన ప్రగతి

‘పల్లె’వించిన ప్రగతి

అభివృద్ధికి కేరాఫ్‌గా ఊట్కూరు
ఉట్టిపడుతున్న పచ్చదనం, పరిశుభ్రత
రోడ్లకిరువైపులా ఆహ్లాదపరుస్తున్న మొక్కలు
మిరిమిట్లు గొల్పుతున్న వీధి దీపాలు
అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీ అడుగులు
మారుతున్న గ్రామ రూపురేఖలు
నాగర్‌కర్నూల్‌, మార్చి 16 (నమస్తే తెలంగా ణ) : ఊట్కూరు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. పల్లెప్రగతి కార్యక్రమం ఆ గ్రామ రూపురేఖలనే మార్చేసింది. పచ్చదనం, పరిశుభ్రత ఉట్టిపడుతుండగా.. రోడ్లకిరువైపులా హరితహారం మొక్కలు ఆహ్లాదపరుస్తున్నాయి. రాత్రిళ్లు మిరుమిట్లు గొల్పుతూ వీధి దీపాలు జిగేల్‌ మంటున్నాయి. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, రైతువేదిక, ఎకరా స్థలంలో పల్లెప్రకృతి వనం, సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ కాల్వలు, 90 శాతం మరుగుదొడ్ల నిర్మాణం గ్రామానికి మణిహారంగా నిలుస్తున్నాయి. నిత్యం చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం అడుగులు వేస్తున్నది. గ్రామస్తుల సహకారంతో స్వచ్ఛ పల్లెగా మారుతున్నది.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. రూ.13 లక్షలతో వైకుంఠధామం, రూ. 2.50 లక్షలతో డంపింగ్‌ యార్డు, రూ.21 లక్షల తో రైతు వేదికలను నిర్మించారు. గ్రామ శివారులో ఎకరా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన పార్కు పనులు తుదిదశకు చేరుకున్నాయి. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పలు వార్డుల్లో రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్‌డ్రైన్ల పనులు చేపట్టారు. ఉపాధి హామీ నిధులతో 90 శాతం మ రుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో చెక్‌పోస్టు నుంచి మొ గ్దుంపూర్‌ రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా, గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 20 మంది పంచాయతీ కార్మికులను వార్డుల వారీగా విభజించి నిత్యం మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్నారు. రోడ్ల పై చెత్తాచెదారం లేకుండా అద్దంలా ఉంచుతున్నా రు. చెత్తను పంచాయతీ ట్రాక్టర్‌, ట్రై సైకిళ్ల సా యంతో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. చెత్త వేసే విధానం, తడి, పొడి చెత్త ఎలా వేరు చేయా లి..? దాని వల్ల కలిగే లాభాలు, అనర్థాలను ప్రజలకు వివరించి చైతన్యం కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా ఏండ్ల తరబడి పేరుకుపోయిన పారిశుధ్యం మెరుగుపడింది.

సమస్యలకు పరిష్కారం..
పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పురాతన తుప్పు పట్టిన వి ద్యుత్‌ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సి మెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేశారు. రో జంతా వెలిగే వీ ధి దీపాలను ని యంత్రించడానికి ఆన్‌, ఆఫ్‌ స్విచ్‌లు బి గించారు. దీంతో పంచాయతీకి విద్యుత్‌ బిల్లుల నుం చి ఉపశమనం లభించింది. శిథిలావస్థకు చేరిన మట్టి మిద్దెలను తొలగించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ, ఉపాధి సిబ్బంది చేయూత అందించారు. గ్రామం నుంచి వెళ్లి స్థిరపడిన ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, వ్యాపారవేత్తలు తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామస్తుల ఆర్థిక సాయంతో గ్రామంలోని ప్రధాన కూ డళ్లు, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలు కూర్చునేందుకు వీలుగా సిమెంటు బెంచీలను ఏర్పాటు చేశారు.

ఉత్తమ జీపీగా ఎంపిక..
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఊట్కూర్‌ గ్రామంపై ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామానికి డబుల్‌ బీటీ రోడ్డు సౌకర్యం కల్పించారు. రూ.2.25 కోట్లతో ప్రభు త్వ జూనియర్‌ కళాశాల, రూ.15 లక్షలతో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం, గ్రామంలోని చెక్‌పోస్టు నుంచి మొగ్దుంపూర్‌ వెళ్లే అంతర్గత రహదారికి రెండు వైపులా 26 హైమాస్టు లైట్లను ఏ ర్పాటు చేయించారు. ఏడాది కిందట చేపట్టిన రెండో విడుత పల్లెప్రగతి పనులను పరిశీలించిన అధికారులు.. సర్పంచ్‌ కృషిని గుర్తించి గ్రామాన్ని ఉత్తమ జీపీగా ప్రకటించారు. గ్రామంలో అంచెలంచెలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను చూ సి పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నా రు. 40 ఏండ్ల కిందట కనుమరుగైన సంతను పు నఃప్రారంభించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘పల్లె’వించిన ప్రగతి

ట్రెండింగ్‌

Advertisement