e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు దేవుడు సర్వాంతర్యామి

దేవుడు సర్వాంతర్యామి

దేవుడు సర్వాంతర్యామి

బాల్య దశలోనే నైతిక విలువలు పెంపొందించాలి
ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి
వనపర్తి వేంకటేశ్వరస్వామి ఆలయ 45వ బ్రహ్మోత్సవాల్లో చినజీయర్‌స్వామి
వనపర్తి టౌన్‌, మార్చి 16 : దేవుడు స ర్వాంతర్యామి అని చినజీయర్‌స్వామి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో 45వ బ్రహ్మోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ము న్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ స్వగృహానికి వెళ్లి పుష్పాభిషేకం, దీపారాధన, అ ర్చన నిర్వహించారు. ఉదయం వేంకటేశ్వర స్వామి ఆలయం లో సుప్రభాత సేవ, తీర్థగోష్టి, మహాపూర్ణాహుతి, లక్ష్మీహయగ్రీవ హోమం నిర్వహించారు. అనంతరం రాజనగరం రోడ్డులో ఉన్న విశ్వక్సేన గోశాలలో సప్త గోవుల కుటీరం, వెటర్నరీ దవాఖానకు భూమిపూజ చేశారు. 40వేల లీటర్ల వాటర్‌ ట్యాంకును, అతిథి గృ హాన్ని, గో తులాభారాన్ని ప్రారంభించారు. సాయం త్రం వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకన్న, అలివేలు మంగ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ బాల్యదశలోనే పిల్లలకు నైతిక విలువలను పెంపొందించాలన్నారు. దేవుడు సర్వంతర్యామి అని.. పక్షుల్లో, నీటిలో ఉన్న జలచరాలు, ప్రాణంలేని జంతువుల్లో, సూర్య, చంద్రులలో, ప్రాణంలేని ప్రతి వ స్తువులోనూ దేవుడు ఉన్నాడన్నారు. మనసు గొప్పదని, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలన్నారు. చేసే పనిలో విశ్వాసం ఉంటే విజయం దానంతట అది వరిస్తుందని అన్నా టరు. కల్యాణోత్సవానికి భక్తులు అశేషంగా హాజరై తన్మయత్వం చెందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చై ర్మన్‌ రమేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, అలైఖ్య, తిరుమల్‌, ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు, వికాస తరంగిణి సభ్యులు, అర్చకులు, గోశాల నిర్వాహకులు, నాయకులు రమేశ్‌, విష్ణుసాగర్‌, యోగారెడ్డి, కురుమూర్తి, బీచుపల్లియాద వ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేవుడు సర్వాంతర్యామి

ట్రెండింగ్‌

Advertisement