కొండాపూర్ : భోజన ప్రియులకు అమెరికన్ ఆతిథ్యమందించేందుకు మాదాపూర్‌లోని నాలెడ్జ్ సిటీ ఐటీకారిడార్‌లో హార్డ్ రాక్ 2వ బ్రాంచ్‌ను మంగళవారం ప్రారంభించారు. తాజా, నాణ్యతతో కూడిన అమెరికన్ మెనూను టెకీలకు, సందర్శ కులకు అందించేందుకు ఈ కేఫ్‌ను ప్రారంభించామని సంస్థ యాజమాన్యం తెలిపింది. నగరంలో హార్డ్‌రాక్ 12వ వార్షిక వేడుకల్లో భాగంగా ఐటీ కారిడార్‌లో రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన మెనూను వినియోగదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్టార్టర్స్, బీబీక్యూ అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయని, ఇక్కడికి వచ్చేవారు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు.