కొండాపూర్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాట పటిమను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కొండాపూర్ పోలీసు బెటాలియన్ అదనపు కమాండెంట్ టీ గంగారామ్ పేర్కొన్నారు. సోమవారం బాపూజీ జయంతిని పురస్కరించుకుని బెటాలియన్లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గంగారామ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న బాపూజీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన గొప్ప వ్యక్తన్నారు. తెలంగా ణ ప్రత్యేక ఉద్యమ సమయంలో ముందుండి నడిచి రాష్ట్రప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చిన మహానుభావుడన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ దేవిదాస్ రాథోడ్ , ఎం రహమాన్ , డీ సత్యనారాయణ, డీ నారాయణ దాస్, అధి కారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.