TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Karimnagar News
3/12/2016 1:50:22 AM
టార్గెట్ దిశగా టాస్క్!
కొత్తపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు ముగిసిన వెంటనే ఉద్యోగాలు సంపాదించడమంటే మాటలు కాదు. ఇంజినీరింగ్‌లాంటి వృత్తి కోర్సులను అభ్యసించిన ఎందరో నిరుద్యోగులగా మిగిలిపోతున్న తరుణంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చాలా మంది విద్యార్థులకు తెలివితేటలు పుష్కలంగా ఉన్నా, కావాల్సిన వృత్తి నైపుణ్యాలు లేక ఉద్యోగాలు సాధించలేని దుస్థితి! ఇలాంటి వారిలో వ్యక్తిగత, సంస్థాగత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొం దించి ఉద్యోగాలు, ఉపాధిలో స్థిరపడే లక్ష్యంతో ఏర్పడిందే టాస్క్(తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్). రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జూన్ 2న ప్రారంభమైన ఈ సంస్థ కొద్ది నెలలుగా జిల్లాలోని పలు డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక శిక్షణ కార్య క్ర మాలు నిర్వహిస్తున్నది. చదువు ముగిసిన వెంటనే కొలువులను కొల్లగొట్టేలా విద్యార్థులను వివిధ అంశాల్లో తీర్చిదిద్దుతున్నది.

టాస్క్ ఏం చేస్తున్నదంటే..
ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంసీఏ, ఎంబీఏ వి ద్యార్థులకు వ్యక్తిగత, సంస్థాగత, సాంకేతిక నైపుణ్యాలపై శిక్ష ణ అందజేస్తున్నది. కార్పొరేట్ కంపెనీలు ఆశిస్తున్న స్థాయిలో వృత్తినైపుణ్యాలు పెంపొందిస్తున్నది.

నమోదు తప్పనిసరి..
టాస్క్‌లో రిజిస్టర్ అయిన కళాశాలల విద్యార్థులకు మాత్ర మే శిక్షణ ఇస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది ఆగస్టులో పలు కళా శాలలు టాస్క్‌లో నమోదు చేసుకున్నాయి. ఆ తర్వాత సెప్టెం బర్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసిన వారికి ఆయా క్యాంపస్‌లలోనే శిక్షణ తరగతులు ప్రారంభించారు.

గతేడాది 5వేల మందికి పైగా శిక్షణ..
టాస్క్ ఆధ్వర్యంలో గతేడాది ఐదు వేల మందికిపైగా శిక్షణ ఇచ్చారు. ఇందులో 1100మంది డిగ్రీ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌పై, 600మందికి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌పై, 550 మందికి ఐటీ స్కిల్స్‌పై, 2100మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు పీఓపీ స్కిల్స్‌పై, ఇంకా వివిధ అంశాల్లో 676 మంది శిక్షణ పొందారు.

బోధకులకు సైతం..
కేవలం విద్యార్థులకే కాకుండా వరంగల్ నిట్ సహాయంతో ఆయా కళాశాలల బోధకులకు సైతం మూడు నుంచి ఐదు రోజుల పాటు విభిన్న అంశాల్లో శిక్షణ ఇసు న్నారు. సాంకేతిక నైపుణ్యాలతోపాటు ఆంగ్లంలో పట్టు సా ధించేందుకు అవసరమైన మెళకువలు నేర్పిస్తున్నారు.

2016-17లో టాస్క్ ప్రణాళిక ఇలా..
గతేడాది ఇంజినీరింగ్, డిగ్రీ పీజీ విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇచ్చిన టాస్క్, 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ, పాలిటెక్నిక్, బీఫార్మసీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేం దుకు సిద్ధమవుతున్నది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 18 డిగ్రీ కళాశాలలు, 15 ఇంజినీరింగ్ కళాశాలలు టాస్క్‌లో చేరగా, ఇందులో ఇప్పటికే 2100మంది ఇంజినీరింగ్, 1048మంది డిగ్రీ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం.
656
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd