e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home జిల్లాలు karate educacion | పాఠశాలల్లో క‌రాటే విద్యను ప్రవేశపెట్టాలి : సినీ నటుడు సుమన్‌

karate educacion | పాఠశాలల్లో క‌రాటే విద్యను ప్రవేశపెట్టాలి : సినీ నటుడు సుమన్‌

చిక్కడపల్లి : ఆత్మ రక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడే కరాటేను రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్‌ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.రుద్రమదేవి షోటోకాన్‌ కరాటే సెల్ఫ్‌ డిఫెన్స్​‍ అకాడమీ ఆధ్వర్యంలో ఆధివారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీనియర్‌ బ్లాక్‌బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌, విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్ల ప్రదాన‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్‌ విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠాశాలల్లో కరాటే తరగతులు ప్రవేశ‌పేడితే బాలలకు ఎంతో ఉపాయోగ పడుతుందని, ఆత్మరక్షణ తో పాటు దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపకురాలు లక్ష్మి, రవి, చందు, శ్రీనివాస్ రావు, డి.ఎస్.రెడ్డి, సంగీత దర్శ‌కుడు బోలే షావలి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement