TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
7/25/2016 11:47:43 PM

తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ

తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం పదో ఉపాధ్యక్షునిగా(వీసీ) ఆచార్య ఎస్వీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు వర్సిటీ రిజిస్ట్రార్ సత్తిరెడ్డి తదితరులతో చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తొమ్మిది మంది వీసీల వారసత్వాన్ని అందిపుచ్చుకొని విశ్వవిద్యాలయాన్ని అబివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వవిద్యాలయం అకాడమిక్ సెనెట్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో ప్రెస్ అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ, అధికార భాషా సంఘం, అకాడమీల సహకారంతో ముందుకెళ్తానన్నారు.

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర
నగరలోని రాంనగర్‌లో నివాసం ఉండే సత్యనారాయణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ డీన్‌గా కొనసాగుతూ ప్రగతిశీల ఉద్యమాలకు తన రచనలతో చేయూతనందిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తనవంతు పాత్రను పోషించారు. ఉత్తమ సాహిత్య గ్రంథాలను, కావ్యాలను, సంపుటిలను, కవితలను రచించిన ఆయన తెలుగు సాహిత్యంలో తనముద్రను వేసి అనేక పురస్కారాలను అందుకున్నారు.
306
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd