MONDAY,    December 17, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
6/29/2016 3:47:03 AM

టీవీ రచయితల సంఘం అధ్యక్షుడిగా నాగబాల సురేష్‌కుమార్

వెంగళరావునగర్, జూన్ 28: తెలుగు టెలివిజన్ రచయితల సంఘం 2016-18 లకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. దీనికి నాగబాల సురేష్‌కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

గౌరవ అధ్యక్షులుగా కొమ్మనాపల్లి గణపతిరావు, గౌరవ సలహాదారులుగా డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, ప్రధాన సలహాదారులుగా తోటపల్లి సాయినాథ్, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, బ్నిం, ఉపాధ్యక్షులుగా వెనిగళ్ల రాంబాబు, ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా కాంచనపల్లి రాజేంద్రరాజు, సంయుక్త కార్యదర్శులుగా శశాంక, మల్లం రమేష్, బాలా త్రిపుర సుందరి, నిర్వాహక కార్యదర్శులుగా శ్రీధర్ బీచరాజు, బుర్రా సాయిమాధవ్, మేకా రామకృష్ణ, రేణుమాను భాషా, కోశాధికారిగా శ్రీశైలమూర్తి, లీగల్ అడ్వయిజర్‌గా కేవీఎల్ నరసింహారావు, ప్రచార కార్యదర్శిగా నరేంద్రరెడ్డి, సభ్యులుగా త్యాగరాజు, రవికిరణ్, నారాయణబాబు, ఫణికుమార్, క్రాంతి, మల్లికార్జున్ సానా, లక్ష్మీకిరణం, రూర, సులోచన, అనిత, రాజ మహంతి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు కొమ్మనాపల్లి గణపతిరావు ఎన్నికల అధికారిగా, తోటపల్లి సాయినాథ్ ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
255
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd