కొండాపూర్ : అనుమతులకు మించి చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని బుధవారం నోడల్ ఆఫీసర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బందితో కలిసి కూల్చివేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా చేపడుతున్ననిర్మాణాల వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాక్ సిబ్బంది సేకరించినట్లు తెలిపారు.
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్మాణాల అనుమతులను సులభతరం చేసిందని, టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా నిర్మాణదారులకు సూచించారు. అనుమతులు ఉన్న వరకే నిర్మాణాలు చేపట్టాలని, అంతకుమించి కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.