మాదాపూర్ : మాదాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యారీ క్లెయిర్ సెలూన్‌ను గురువారం టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బెంగుళూరు, చెన్నై, పుణే, ముంబై వంటి నగరాల్లో 30కి పైగా స్టోర్స్ ఉన్నాయని, నగరంలో 7వ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్లు నిర్వహకురాలు నిత్యారెడ్డి, వీణారెడ్డిలు తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు మ్యారీ క్లెయిర్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. స్టోర్‌లో అందుబాటులో ఉన్న ప్రోడక్ట్స్నగర యువతను ఆకట్టుకుంటాయని వారు పేర్కొన్నారు.