e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home జిల్లాలు Hyderabad | మండలపరిషత్‌ నిధులపై మంత్రి ఎరబెల్లిని కలిసిన ఎంపీటీసీల సంఘం

Hyderabad | మండలపరిషత్‌ నిధులపై మంత్రి ఎరబెల్లిని కలిసిన ఎంపీటీసీల సంఘం

ఖైరతాబాద్‌: మండల పరిషత్‌లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్‌ గౌడ్‌ కోరారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్‌ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం తరపున మంత్రికి మొక్కను, వినతి పత్రాన్ని అంజేశారు.

మండల పరిషత్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లతో పాటు ప్రతి సభ్యునికి రూ.20లక్షలు, సంవత్సరానికి రూ.1,200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి దయాకర్‌ రావు సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే నిధుల మంజూరీకి కృషిచేస్తానన్నారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌, కోశాధికారి మన్నె రాజు, నాయకులు కుమార్‌, అశోక్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana