ముషీరాబాద్ :టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ గోల్నాక, 6 నెంబరు ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 16తేదీ(నేడు)సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గోల్నాక, 6 నెంబరు ఫీడర్ల పరిధిలోని ఖాద్రిబాగ్, 6 నెంబర్ ఎక్స్ రోడ్, బండల గడ్డ, 6 నెంబర్ మొయిన్ రోడ్, షర్టన్ హోటల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.