TUESDAY,    December 11, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Warangal News
4/22/2016 2:15:47 AM
హరికథ కళానిధి వెలిదె అస్తమయం..
ఖిలావరంగల్, ఏప్రిల్ 21: రాగయుక్తమైన ఆ కథాగానం ప్రేక్షకలోకానికి దూరమైంది. కథలకే కళానిధిగా పేరుపొందిన వెలిదె అస్తమయమయ్యారు. హరికథ కళానిధి, హరికథ భా స్కర, హరికథ సుధానిధి, సువర్ణఘంటా కంకణ సన్మాన గ్రహీ త, విభవనామ ఉగాది పురస్కారగ్రహీత వెలిదె హరిశంకర్‌శాస్త్రి భాగవతాదులు(86) శుక్రవారం మృతిచెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వేస వితాపం తట్టుకోలేక పరమపదించారు. జిల్లాలో హరికథకు ప్రాణం పోసిన గొప్ప కళాకారుడిగా పేరొందిన ఆయన మృతి ప్రేక్షకలోకానికి తీరని బాధకలిగించింది.

ఓరుగల్లు కళాకారులు, ప్రేక్షకులు బాధాతప్త హృదయాలతో కన్నీటి పర్యంతమయ్యా రు. 1930జూన్ 5న వెలిదె లక్ష్మీబాయి, నర్సింహరామయ్యశాస్త్రి దంపతులకు రంగశాయిపేటలో హరిశంకర్‌శాస్త్రి జన్మించా రు. స్థానికంగా ఉన్న ప్రభుత్వపాఠశాలలో ఉర్దూమీడియంలో మెట్రి క్ వరకు చదివారు. విద్యభ్యాసంతోపాటే మడికొండ సత్యనారాయణశాస్త్రి వద్ద హరికథ, చల్లపల్లి పంచనాధం వద్ద సంగీతం నేర్చుకున్నారు. హరికథలు చెప్పడంలో తనకుతానే సాటిగా ఉమ్మడిరాష్ట్రంలో వేలల్లో కచేరీలు నిర్వహించి పలువురి మన్ననలు పొందారు. ఆయన సంగీతం, హరికథను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వస్తి శ్రీ విభవనామ సంవత్సర పురస్కారాన్ని అందించారు. అలాగే 1982లో కరీంనగర్‌లో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సందర్భంగా చేసిన హరికథా కాలక్షేపాన్ని గుర్తించి సువర్ణఘంటా కంకణ సన్మానం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో వెలిదె హరిశంకర్‌శాస్త్రి వేలసంఖ్యలో వేదికలపై హరికథాగానం చేసినందుకు నాటి అధికారులు, కళాకారులు హరికథ కళానిధి, హరికథ భాస్కర, హరికథ సుధానిధి అనే బిరుదులతో సత్కరించారు. కాగా, ఆయనకు కుమారుడు వెలిదె నర్సింగశాస్త్రి, కుమార్తె ఉషారాణి ఉన్నారు.
356
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd