WEDNESDAY,    December 19, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Warangal News
6/25/2017 1:20:21 AM
వావ్.. మైమ్
-మై(మ్)మరపించే మధు మాయాజాలం
-ఏకశిలాపురి నుంచి విశ్వవ్యాప్తమైన కళాకారుడు
-ప్రపంచదేశాల్లో మైమ్ ప్రదర్శనలు
-విదేశీ స్కాలర్‌షిప్ అందుకున్న
-తొలి భారతీయుడు
-నవ్య రీతులతో అంతర్జాతీయ ఖ్యాతి

నిట్‌క్యాంపస్, జూన్24: అతను నోటితో చెప్పడు. ము ఖంతో చెప్తాడు. మాట్లాడకుండా మొక్కజొన్న కంకి గింజ లు సాలుతీసి ఒలిచి పెట్టినట్టే అతను ముఖంతో ప్రతీ అంశా న్ని పెదవి కదపకుండా మనసు దోచే విధంగా విప్పి చెప్తా డు. మాయగాడు. ఎంత మాయగాడంటే ప్రపంచాన్నే ము రిపించి మెరిపించే మాయగాడు. అదే అతని ఆస్తి. ఎంద రికో అది స్ఫూర్తి. వరంగల్ నుంచి ఎదిగిన ఓ కెరటం. ఇ వ్వాళ యువకెరటానికి ప్రతీక. ప్రపంచం అంతా అతని సమ్మోహనా కళకు ముగ్ధమైంది. అత్యంత సంక్లిష్టమైన ము ఖాభినయ కళ(మైమ్)కు అతడే ఇవ్వాళ ఒక సిలబస్. అత నికి స్వదేశంలోనే కాదు విదేశాల్లో అదీ మైమ్‌కు పేటెంట్‌గా ఉన్న ఫ్రాన్స్ వంటి దేశంలో కూడా అత నికి శిష్యులున్నా రు. కళలకు కాణాచి ఓరుగల్లు. తన మైమ్ కళనే ఇంటిపే రుగా మార్చుకున్నవాడు. అతడే మైమ్ మధు. మైమ(మ్) రచిపోయే విన్యాసం అతనిది. అతని కళ ఇవ్వాళ విశ్వ జనీనమైంది. విశ్వవిఖ్యాత మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణు మాధవ్‌ను తొలి గురువుగా భావిస్తాడు. ఉత్థాన శిఖర మె క్కిన మైమ్ మధు వచ్చేనెలలో పదిహేను రోజులపాటు ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నారు. అన్నట్టూ మైమ్ మధు సతీమణి సహకళాచారిణే. ఆమెది ఫ్రాన్స్ దేశం. పప్పె ట్ షోలో ఆమెదక్కడ అందెవేసిన చేయి. ఆ ఇద్దరి పెళ్లీ ఇక్క డే అయింది. దేశ, విదేశాల్లో వందలాది ప్రదర్శనలిచ్చానా అదేస్థాయిలో అవార్డులు, రికార్డులు అందుకున్నా సరే పుట్టిన ఊరులో తిరిగి ఎదుగుతున్న గడ్డమీద ఒక వర్క్‌షాప్ నిర్వహించబోతున్నారు.

ఈ నేపథ్యంలో అరుసం మధు అలియాస్ మైమ్ మధుగా కళా ప్రయాణాన్ని ప్రత్యేక కథ నంగా నమస్తే తెలంగాణ అందిస్తోంది.
అరుసం మధు అలియాస్.. మూఖాభినయం(మైమ్) అత్యంత సంక్లిష్టమైన శారీరక భావాభినయం. మాటలతో కాకుండా శరీర భాషతో అంద రికీ అర్థం అయ్యేలా ప్రదర్శించే కళ. అలాంటి కళలో ప్రావీ ణ్యం మాత్రమే కాదు పట్టుసాధించడం అంటే మాటలు కా దు. నగరంలోని భీమారానికి చెందిన అరుసం మధు సూదన్ 25 ఏళ్లుగా తపస్సులాగా తనికెళ్ల భరణి చెప్పినట్టు యజ్ఞంలా ఆ కళను ఆరాధిస్తున్నారు. ఎదుగుతూ ఎదుగు తూ ఏకశిలా శిల్పం అంత ఎత్తుకు ఎదిగిపోయి తన ఇంటి పేరును మార్చుకొని మైమ్ మధుగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఆ కళలో అంతర్జాతీయ కళాకారుడిగా ఎదిగాడు. అనేక దేశాల్లో ప్రదర్శనలిస్తూ ఇండియన్ మైమ్ అకాడమీ స్ధాపించి దేశంలోని ఔత్సాహికులకు మైమ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. పుట్టిన గడ్డమీద మమకారంతో తొలిసారి వరంగల్‌లో తెలంగాణా సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహకారంతో మైమ్ వర్కషాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
తొలిగురువు.. తొలినడకలు వరంగల్ కళలకు పుట్టినిట్లు. మిమిక్రీ కళకు ఆద్యుడుగా నిలిచిన పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్, మైమ్ కళకు తొలిగు రువు అయిన వరంగల్ నాగభూషణం ఆదిగురువులని మధు వినమ్రంగా ప్రకటించాడు. తనకు వచ్చిన కళలన్నీ నేర్పిన నాగభూషణం మధులోని కళాతృష్ణను గమనించి కలకత్తాలోని మరో గురువు దగ్గరికి తన స్వంత ఖర్చులతో పంపించిన గొప్ప వ్యక్తి. ఇక నేరెళ్ల వేణుమాధవ్ తొలుత పాఠశాలల ప్రదర్శనలకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించారు. పర్సనాలిటీ డెవలప్ మెం ట్ గురువుగా వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం గొప్ప అనుభూతి అని మధు అంటున్నాడు. మైమ్ అంటే ఎవరికీ తెలవని తొలినాళ్లలో దాన్ని నేర్చుకోవాలనే కోరికను వ్యక్తప రిచిన శిష్యుడిని ఏ గురువైనా అనందంగా స్వీకరిస్తారు. వారి విశ్వాసం, ఆ తొలి మజిలీనే ఇవ్వాళ మధుసూదన్ మైమ్ మధుగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందుతా డని బహుశా ఆయన గురువులు కూడా ఊహించి ఉండరు.

వర్క్‌షాప్‌లు కళ ప్రాచుర్యం పొందాలంటే విశ్వవ్యాప్తం కావాలి. తాను నేర్చుకున్నది మరొకరికి అందించాలనే ఉద్దేశంతో 2002లో ఇండియన్ మైమ్ అకాడమీ స్ధాపించాడు. అ కాడమీ ద్వారా అనేక రాష్ర్టాల్లో ఔత్సాహికులైన యువతకు శిక్షణ ఇస్తున్నాడు. వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి కళాకారు లను తయారు చేస్తున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో ఉత్థానం పేరుతో 15 రోజుల వర్క్‌షాప్‌ను ఇటీవలే విజయవంతంగా నిర్వహించాను. నేను15 ఏళ్లు నేర్చుకున్న కళను త్వరగా అందిస్తున్నాను. సాత్విక, ఆంగిక, ఆహార్య, వాచకాభినయంలో పట్టు సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. సాంకేతికత పెరుగుతున్న ఈ రోజుల్లో వారు మరింత అడ్వాన్స్‌డ్‌గా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తు న్నాడు. ప్రస్తుతం పుణే ఫిలిం ఇన్టిట్యూట్‌లోని విద్యార్థులకు నటనలో భాగమైన మైమ్‌ను పాఠంగా చెబుతున్నాడు.
మైమ్‌లో సొంత శైలి కళలో ప్రత్యేకత చూపించకపొతే వెనకబడిపోతామన్నది మధు భావన. లబ్దప్రతిష్టులైన కళాకారులు ఉన్నప్పటికీ సొంత శైలిని అనుకరించడం వల్లే అంతర్జాతీయ కళా కారు డిగా ఎదిగాడు. ఇది యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుం ది. మోహినీ అట్టం, ఒడిస్సీ, మైమ్ కలగలిపి ఫ్యుజన్ చేయ గలడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిలోని 49 వ పద్యంపై మైమ్ ప్రదర్శించి బెంగాల్ అభిమానుల మ న సు దోచుకున్నాడు. మనిషి ఆరోగ్యానికి డాక్టర్ కావాలి, మ నస్సుకు ఈస్థటిక్ సెన్స్ కావాలి. సెన్స్ ఉన్న కళాకారుడు మాత్రమే రాణిస్తాడని తన అనుభవం చెబుతున్నదని చిరు నవ్వుతో భవిష్యత్ కోరుకునే కళాకారులకు చెబుతున్నాడు.
ప్రేమ-పెళ్లి
సబ్రినాతో ప్రేమ, పెళ్లి అనుకోకుండా జరిగిపోయిందని మధు తెలిపాడు. 2016లో ఫ్రాన్స్ నుంచి తను మైమ్ నేర్చుకోవడానికి ఇండియాకు వచ్చింది. హైదరాబాద్‌లోనే తను పరిచయం అయ్యింది. కొద్ది రోజుల్లోనే మా మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లింది. ఇంట్లో ఇరువైపులా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో 2016 అక్టోబర్‌లో వరంగల్‌లో మా పెళ్లి జరిగింది. తను ఇండియన్ రాజస్థానీ పపెట్ షోలో నిష్ణాతురాలు అని తన సహకళాచారిణి గురించి మురిపెంగా వివరించాడు. అయినా మా అమ్మానాన్నలు (సబ్రినా) మహాలక్ష్మిగా పిలుచు కుంటారని చెప్పారు.
156
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd