TUESDAY,    December 18, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Warangal News
9/5/2016 2:16:45 AM
జ్యోతిరెడ్డి సేవలు అభినందనీయం
-శాంతిదూత అవార్డు ప్రదానోత్సవంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు
నయీంనగర్, ఆగస్టు4: జ్యోతిరెడ్డి సేవలు అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డికి ఆదివారం నయీంనగర్‌లోని వాగ్ధేవి కళాశాల ఆడిటోరియంలో సొసైటీ అధ్యక్షుడు అం పశయ్య నవీన్ అధ్యక్షతన శాంతిదూత అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ జ్యోతిరెడ్డి జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలస్తుందన్నారు.

ఉన్నతస్థాయికి చేరుకోవాలనుకునే వారికి జ్యోతిరెడ్డి మంచి ఉదాహరణ అని అన్నారు. వ్యవసాయ కూలీగా పని చేసి ఇంగ్లిష్ నేర్చుకుని అమెరికాలో కంపెనీ స్థాపించిన జ్యోతిరెడ్డిని మహిళలు రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. జ్యోతిరెడ్డిని శాంతిదూత అవార్డుకు ఎన్నుకుని సొసైటీ సభ్యులు సన్మానించడం అభినందనీయమన్నారు. సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ హెచ్‌ఎం టీవీలో ప్రసారం చేసిన జ్యోతిరెడ్డి జీవిత కథనం ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించిందన్నారు.

శాంతి స్థాపన కోసం పీస్ సేవాసొసైటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అనంతరం అవార్డు గ్రహీత జ్యోతిరెడ్డి మాట్లాడుతూ జీవితం లో తాను ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. అనంతరం అతిథులు జ్యోతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. వరంగల్‌కు చెందిన మదర్‌థెరిస్సా పాఠశాల యాజమాన్యం ప్రసంశాపత్రం అందజేసింది. ఈ సమావేశంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరాజొద్దీన్, బండా ప్రకాశ్, సాంబారి సమ్మారావు, వాగ్ధేవి కళాశాల కరస్పాండెంట్ దేవేందర్‌రెడ్డి, మల్లికాంబ మనోవికాస సెక్రటరీ తౌటం శ్రీనివాస్ పాల్గొన్నారు.
345
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd