WEDNESDAY,    December 12, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Medak News
10/7/2017 11:23:08 PM
దేశ రక్షణలో వైమానిక దళం
-నేడు భారత వైమానిక దళ దినోత్సవం
టేక్మాల్ : ఆకాశ మార్గాన్ని కాపాడుతూ, నిరంతరం దేశభద్రత, యుద్ధ సమయాల్లో దేశరక్షణ, ప్రకృతి భీభత్సవం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ అహర్నిషలు గగనతలంలో గస్తీ కాస్తోంది వైమానిక దళం... భారత వైమానిక దళం దేశరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్రిటీష్ కాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక వైమానిక దళంగా ఏర్పరిచారు. దీనికి సంబంధించిన 1932 భారత వైమానిక దళ చట్టాన్ని ఆ సంవత్సరం అక్టోబర్ 8న ఆమోదించారు. స్వాతంత్రం సిద్దించకముందు బ్రిటిష్ తరపున వైమానికి దళం 1939-1945లో రెండో ప్రపంచ యుద్ధం లో పాల్గొంది. స్వాతంత్రం అనంతరం 1950లో రాయల్‌ను తొలగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా మార్చా రు. తదనంతరం 1962లో భారత్-చైనా యుద్ధం, 196 5, 1967లో భారత్-పాక్ యుద్ధాలు, కార్గిల్ యుద్ధంలో పా ల్గొని తన ప్రతిభాపాటవాలను చూపింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో పాలు పంచుకుని అం తర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి వైమానిక దళంలో పనిచేస్తున్న వారందరికీ సగర్వంగా వైమానిక దళ దినోత్సవం జరుపుతారు.

మొదట ఐదుగురు పైలట్లతో...
ప్రపంచ దేశాలతో తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడంలోనూ అధునాతన యంత్ర సామాగ్రిని సమకూర్చుకోవడంలోనూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో ఉండటమే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. 1932 అక్టోబర్ 8వ తేదీన స్థాపితమైనప్పటికి భారత వైమానిక దళంలోకి తొలి ఎయిర్‌క్రాఫ్ట్ 1933 ఏప్రిల్ ఒకటో తేదీన వచ్చి చేరింది. ఆరంభంలో కేవలం ఐదుమంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్ తో ప్రారంభమైంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు తొలి ఐదుగురు పైలట్స్‌గా విధులు నిర్వహించిన ఘనత హరీష్ చంద్ర స ర్కార్, సుబ్రొతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఆజాద్ భక్షా అవాన్, అమర్జీత్ సింగ్‌లు వైమానిక చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా సు బ్రతో ముఖర్జీ తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. త ర్వాత రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అంచలంచెలు గా మ రింత మంది సిబ్బందిని ఐఎఎఫ్ నియమించుకుం ది. ఇం డియన్ ఎయిర్‌ఫోర్స్ తొలి విమానం వెస్ట్‌లాండ్ వాపిటి.

కదన రంగంలో...
భారత వైమానికి దళం పలు యుద్ధ్దాల్లో పాల్గొని విరోచిత పటిమను ప్రదర్శించింది. 1962లో చైనా-భారత్ మధ్య సరిహద్దు వివాదం తలెత్తి యుద్ధం అనివార్యమైంది. సినో-ఇండియా యుద్ధం సందర్భంగా భారతీయ సైనిక వ్యూహకర్తలు కుట్రలను పసిగట్టడంలో విఫలమైనా, ఎయిర్‌ఫోర్స్ అత్యంత సమర్ధవంతంగా పనిచేసింది. ఆపరేషన్ కాక్టస్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ యుద్ధం, 1965 ఇండో-పాక్ యుద్ధం, 1967లో ఇండో-పాక్ యుద్ధం, కాంగో క్రైసిస్, ఆపరేషన్ పూమలై, ఆపరేషన్ పవన్‌లలో పోరాట పటిమను కనబర్చింది.
177
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd