FRIDAY,    December 14, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Khammam News
9/11/2016 1:51:58 AM
విజయలో జబర్దస్త్ టీమ్ సందడి
కొణిజర్ల, సెప్టెంబర్10 : మండలంలోని తనికెళ్లలో గల విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విగ్నైట్-2కే16(నేషనల్ లెవెల్ టెక్నో అండ్ కల్చరల్ ఫెస్ట్) వేడుకల్లో భాగంగా హాజరైన జబర్దస్త్ టీమ్ సందడి చేశారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫెస్ట్‌లో భాగంగా విద్యార్థులు సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో పోటాపోటీగా ప్రదర్శన నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. జబర్దస్త్ టీమ్‌కు చెందిన రేసింగ్ రాజు, కిరాకార్తీ, టీమ్ బృంద సభ్యులు జీవన్, మురళి, మిమిక్రీ సుధాకర్‌లు తమ స్క్రిప్ట్‌తో అందరినీ అలరించారు. విద్యార్థుల కేరింతలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. ఈసందర్భంగా విద్యార్థులు చేపట్టిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాల బృంద సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు శాస్త్ర సాకేంతిక రంగాల్లోనూ ముందుండాలనే భావనతో ఇలాంటి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం టీమ్ బృంద సభ్యులకు కళాశాల నిర్వాహకులు మెమొంటోలు అందజేసి సత్కరించారు. కళాశాల కరస్పాండెంట్ ఎన్.బుచ్చిరామారావు, ప్రిన్సిపాల్ అబ్బుల్‌సలీం, వైస్ ప్రిన్సిపాల్ చిన్నయ్య, ఈసీఈ హెచ్‌వోడీ ఆయేషా, ప్రోగ్రామ్ కోకన్వీనర్ వీరయ్యచౌదరి, ఇతర విభాగాల హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని పార్వతీ పరమేశ్వరులు మెచ్చారట..ఆకట్టుకున్న రేసింగ్ రాజు స్క్రిప్ట్
వేడుకల్లో భాగంగా జబర్దస్త్ టీమ్ రేసింగ్ రాజు తెలంగాణ ప్రభ్వుత్వాన్ని పార్వతీ పరమేశ్వర్లు మెచ్చుకున్నారనే స్క్రిప్ట్ ఆకట్టుకుంది. ముల్లోకాలు తిరిగే నారద మహార్షికి తారసపడిన పరమేశ్వరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికతతో గుడులు కట్టిస్తున్నారని, భూలోకంలో ఇంతటి మహనీయుడు ఉద్భవించాడని చెబుతున్న సమయంలో దేవాలయాల నిర్మాణంతో మీకు సంతోషమే కానీ.. మరి నాకేంటంటూ పార్వతి ప్రశ్నించడంతో ఆయన అల్లుడు మంత్రి హరీశ్‌రావు మిషన్ భగీరథతో గంగను సైతం ఊరూరా పారేలా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఇలా ప్రభుత్వంపై సాగిన స్క్రిప్ట్ అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.
199
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd