WEDNESDAY,    December 19, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
Hyderabad News
4/21/2015 3:43:17 AM

మానవుల మనస్థత్వాలు ప్రదర్శన

తెలుగుయూనివర్సిటీ, ఏప్రిల్ 20 : తెలుగువర్సిటీ రంగస్థల కళల శాఖ ఎంపీఏ విద్యార్థుల ప్రాయోగిక అంశాల్లో భాగంగా.. సోమవారం తెలుగువర్సిటీలో డాక్టర్ బీహెచ్ పద్మప్రియ దర్శకత్వంలో మనస్థత్వాలు నాటికను విద్యార్థులు ప్రదర్శించారు. పైకి మామూలుగా కనిపించే మనుషులు ఒకానొక సందర్భంలో అనుమానాలు, అపోహలతో మానవ సంబంధాలనే మరిచిపోతారని ఈ నాటిక చాటి చెప్పింది. భమిడిపాటి రాధాకృష్ణ రచించిన ఈ నాటిక మనస్థత్వ విశ్లేషణ ప్రధానంగా సాగింది. విద్యార్థులు వివిధ పాత్రలను ధరించి అద్భుతంగా నటించారు. మల్లాది గోపాలకృష్ణ పర్యవేక్షించారు.
399
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd